ఉఖ్రుల్
ఉఖ్రుల్ (హన్ఫున్), మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.[2] భౌగోళికంఉఖ్రుల్ పట్టణం 25°07′N 94°22′E / 25.12°N 94.37°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 1,662 మీ. (5,453 అ.) ఎత్తులో ఉంది. జనాభా2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఉఖ్రుల్ పట్టణంలో 27,187 జనాభా ఉంది. ఇందులో 13,917 మంది పురుషులు, 13,270 మంది స్త్రీలు ఉన్నారు. ఈ జనాభాలో 3,363 (12.37%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 88.92% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.68% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 86.04% గా ఉంది.[4] మతంఇక్కడి జనాభాలో క్రైస్తవులు 89.65%, హిందువులు 8.76%, ముస్లింలు 0.81%, సిక్కులు 0.06%, బౌద్ధులు 0.52%, జైనులు 0.03%, ఇతరులు 0.17% ఉన్నారు. పరిపాలనఈ పట్టణంలో 5,226 గృహాలు ఉన్నారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందజేయబడుతోంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంది.[4] ఆర్థిక వ్యవస్థఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ ప్రాంతంలో మెరుగైన విద్యుత్ సరఫరా లేదు. రవాణా, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కనిష్టంగా ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలుఉఖ్రుల్ పట్టణంలో అందమైన లోయలు, కొండలు, జలపాతాలు, ప్రవాహాలు ఉన్నాయి.[5]
మూలాలు
వెలుపలి లంకెలు |