ఎం.ఎల్.జయసింహ
మోటగానహళ్ళి లక్ష్మీనరసు జయసింహ (M.L. Jaisimha) హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. జీవిత విశేషాలుజయసింహ 1939, మార్చి 3న సికింద్రాబాదులో జన్మించాడు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు. ఈయన టెస్ట్ క్రికెట్లో భారతదేశం తరఫున ఆడాడు. జయసింహ కుడిచేతి వాటం కల బ్యాట్స్‌మెన్. మోటగానహళ్ళి కర్ణాటకలోని రామనగర జిల్లాలో మాగడి అనే ఊరు దగ్గరి పల్లెటూరు. ఇంటిపేరును బట్టి వారి కుటుంబం ఒకప్పుడు కర్ణాటకలో నుండి హైదరాబాదుకు వచ్చి ఉంటారని ఊహించవచ్చు. ఇతని కుమారుడు వివేక్ జయసింహ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా హైదరాబాదు, గోవా క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ కెరీర్జయసింహ 15 సంవత్సరాల వయస్సులో 1954-55 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు, ఆంధ్ర ప్రదేశ్‌పై హైదరాబాద్ తరపున 90 పరుగులు చేశాడు. 51 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. [1] 1958-59లో అతను సౌత్ జోన్‌లోని ప్రీమియర్ జట్లైన మద్రాస్, మైసూర్‌పై సెంచరీలు చేశాడు. అదే సీజన్‌లో రంజీ మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టడంతో, 1959 లో ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టులో అతనికి చోటు లభించింది. టెస్ట్ కెరీర్లార్డ్స్లో టెస్టుల్లో జయసింహ తొలి అడుగు అంత బాగా మొదలు కాలేదు. అయితే ఆ తర్వాతి రెండు టెస్టుల్లోను అతను రాణించాడు. కలకత్తాలో 1959-60లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో మొదటి రోజు ముగిసే వేళ జయసింహ బ్యాటింగ్‌కు దిగాడు. రెండో రోజు 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడవ రోజు ఆట ముగిసే ముందు, రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు, నాల్గవ రోజు మొత్తం బ్యాటింగు చేసి 59 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రోజు 74 పరుగుల వద్ద ఔటయ్యాడు [2] దీంతో టెస్టు మ్యాచ్‌లోని ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [3] ఒక సంవత్సరం తర్వాత కాన్పూర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జయసింహ, రోజంతా బ్యాటింగ్ చేసి కేవలం 54 పరుగులు చేసాడు. 505 నిమిషాల పాటు సాగిన ఈ ఇన్నింగ్సులో అతాను 99 పరుగులు చేసాడు. శతకాన్ని పూర్తి చేసే పరుగు కోసం ప్రయత్నిస్తూ ఔటయ్యాడు[4] ఆ తరువాత అతను ఓపెనర్‌గా మారాడు. భారత మిడిలార్డరులో స్థానానికి కాస్త పోటీ నెలకొని ఉంది. మేరోవైపు పంకజ్ రాయ్ ఓపెనర్‌గా తన కెరీర్‌ని ముగించాడు. అతని స్థానంలో జయసింహ చేరాడు. 1961-62, 1963-64లో ఇంగ్లండ్‌పై టెస్టు సెంచరీలు, 1964-65లో సిలోన్‌పై 134 పరుగులు చేశాడు. 1963-64లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను 444 పరుగులు చేశాడు. 1964-65లో, అతను హైదరాబాద్ కోసం మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి 713 పరుగులు చేశాడు. కానీ టెస్టు మ్యాచ్‌ల్లో వైఫల్యాల కారణంగా అతడిని తొలగించారు. జయసింహ 1967-68లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన భారత జట్టులో భాగం కాదు, కానీ చందూ బోర్డే, BS చంద్రశేఖర్‌లకు గాయాలవడంతో, ఇతరుల ఫామ్‌ను కోల్పోవడం వల్లనూ జయసింహను తీసుకెళ్ళారు. అతను నేరుగా మూడవ టెస్ట్‌కి వెళ్లి 74, 101 పరుగులు చేసి,, దాదాపు అసంభవమైన విజయాన్ని సాధించాడు. [5] ఆ తరువాత టెస్టు క్రికెట్‌లో ఎన్నడూ 25 పరుగులు దాటలేదు. ఆసక్తికరంగా, అతని మూడు సెంచరీలు ఆయా సిరీస్‌లోని మూడో టెస్టుల్లో వచ్చాయి. అతని చివరి సిరీస్ 1970-71లో వెస్టిండీస్ పర్యటన. జయసింహ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవని కెప్టెన్ అజిత్ వాడేకర్ ఆ తర్వాత రాశాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో తన చివరి ఇన్నింగ్స్‌లో ఒక గంట పాటు బ్యాటింగు చేసి, అతను 23 పరుగులు చేసి, సునీల్ గవాస్కర్‌కు మ్యాచ్‌ను కాపాడడంలో తోడ్పడ్డాడు. [6] అతను 16 సీజన్లలో 76 మ్యాచ్‌లకు హైదరాబాద్‌కు నాయకత్వం వహించాడు. భారత కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అతని నాయకత్వంలో ఆడాడు. రిటైరయ్యాకజయసింహ 1977-78, 1980-81 మధ్య భారత సెలెక్టర్‌గా ఉన్నాడు. 1985-86లో శ్రీలంకకు భారత పర్యటనలో మేనేజరుగా పనిచేసాడు. MCC అతన్ని 1978లో జీవితకాల సభ్యునిగా చేసింది. అతను కొంతకాలం టీవీ వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు. 1987 క్రికెట్ ప్రపంచ కప్‌కు వ్యాఖ్యానించాడు. అతని కుమారులు వివేక్ జయసింహ, విద్యుత్ జయసింహ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు. [7] ఇవి కూడా చూడండిమూలాలు
|