కళలుఆనాటి కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు. వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును. ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు. వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును,రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని, రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు. కళలను 64 గా ప్రాచీనులు వర్గీకరించారు. వీటిల్లో ప్రస్తుతము కొన్ని మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి.
భవన నిర్మాణ శాస్త్రం (ఆర్కిటెక్చర్) , లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్)జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం,[1] ఫైన్ ఆర్ట్స్ , డిజైన్ కామన్ టెస్ట్ ద్వారా కదిలే బొమ్మలు (యానిమేషన్), ఆప్లైడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం,శిల్పం, ఇంటీరియర్ డిజైన్లో డిగ్రీ కోర్సుల ఎంపిక జరుగుతుంది. సంగీత , నృత్యంసర్టిఫికేట్, డిప్లొమా స్థాయిసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 ప్రభుత్వ సంగీత , నృత్య పాఠశాలలు/కళాశాలలో సర్టిఫికేట్ డిప్లొమా స్థాయిలో కోర్సులు ఉన్నాయి. కర్నాటక గాత్రం, వీణ, వయోలిన్,మృదంగం, నాదస్వరం,డోలు,కూచిపూడి, భరతనాట్యం కోర్సు విషయాలుగావున్నాయి.సాధారణంగా జూన్ మాసంలో దరఖాస్తులు ప్రకటన వెలువడుతుంది. ఉ 7 గంటలనుండి 9:30 గంటలవరకు, సా 4 గంటలనుండి 6:30 గంటలవరకు బోధన జరుగుతుంది.
అర్హత: జూలై 1 కి, 10 సంవత్సరాల వయస్సుగలిగి వుండాలి.
అర్హత: జూలై 1 కి, 15 సంవత్సరాల వయస్సుగలిగి వుండాలి. సర్టిఫికేటు కోర్సు ఉత్తీర్ణత
చూడండి: సంగీత నృత్య కళాశాల
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము దూరవిద్యా కేంద్రములో సంగీత విశారద కోర్సు ఉంది. డిగ్రీ, పిజి డిప్లొమా స్థాయిబిఎ కర్ణాటక సంగీతం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము దూరవిద్యా కేంద్రము ద్వారా అందచేస్తున్నది. ఉపాధిస్వయం ఉపాధితో బాటు, వివిధ ప్రచార/సమాచార సాధనాలు/మాధ్యమాలలో ఉపాధి అవకాశాలున్నాయి. ఇవీ చూడండివనరులుLook up arts in Wiktionary, the free dictionary. |