కోనేరు రామకృష్ణారావుకోనేరు రామకృష్ణారావు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారాసైకాలజిస్ట్, తత్వవేత్త, విద్యావేత్త[1]. జననం,విద్యకోనేరు రామకృష్ణారావు గారు కృష్ణా జిల్లా ఎనికేపాడు గ్రామంలో కోనేరు నాగభూషణం, అన్నపూర్ణమ్మ దంపతులకు 1932 అక్టోబరు 4న జన్మించారు[2]. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో విద్యార్థిగా 1953 లో B.A. hons., philosophy 1955లో M.A. hons., psychology చేసి అక్కడే ఉపన్యాసకునిగా పనిచేశాడు. 1958లో ప్రతిష్ఠాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది చికాగో విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు కొరకు అమెరికా వెళ్ళారు, 1962 లో డాక్టరేట్ పొందారు. అమెరికా నుండి తిరిగి వచ్చి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా చేరి 1967లో తొలిసారిగా పారా సైకాలజీ డిపార్టుమెంట్ ను ఎర్పాటు చేసారు. పారా సైకాలజి లో పరిశోధనలుఅతీంద్రియ మనోవిజ్ఞానశాస్త్రములో రామకృష్ణారావు చేసిన పరిశోధనలు ప్రపంచఖ్యాతి పొందాయి. 34వ ఏటనే ప్రపంచ పారా సైకాలజి సంఘమునకు అధ్యక్షుడైనాడు. తిరిగి 1978లో ఆ పదవిని మరలా అధిష్టించాడు. అమెరికా ఆహ్వానముపై అచటి సైకాలజి సంస్థకు అధ్యక్షునిగా వెళ్ళాడు. 1984లో భారత దేశానికి తిరిగివచ్చి తను చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఉపకులపతిగా పనిచేసాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఉన్నత విద్యా పరిషత్ అధ్యక్షునిగా నియమింపబడ్డాడు[3]. 200 పరిశోధనాపత్రాలు, 12 పుస్తకాలు ప్రచురించాడు. పురస్కారాలు2011 జనవరి 26న భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారము ప్రకటించింది. ఆంధ్రా, కాకతీయ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల నుండి గౌరవ డాక్టరేట్ పురస్కారాలు పొందారు పదవులు
మూలాలు
యివి కూడా చూడండి |