Share to:

 

నాయుడుపేట

పట్టణం
Coordinates: 13°54′N 79°54′E / 13.9°N 79.9°E / 13.9; 79.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండలంనాయుడుపేట మండలం
విస్తీర్ణం
 • మొత్తం19.40 కి.మీ2 (7.49 చ. మై)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)524126 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

నాయుడుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లా పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.

భౌగోళికం

ఇది నెల్లూరు నగరమునకు సుమారు 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుండి 108 కిలోమీటర్లు, తిరుపతి నుండి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాయుడుపేట పట్టణం తిరుపతి జిల్లాలో ముఖ్యమైన కూడలి.ఈ పట్టణం గుండా చెన్నై,తిరుపతి,నెల్లూరు వంటి నగరములకు రోజూ అధిక సంఖ్యలో ప్రయాణీకులు వెల్తుంటారు.

నదులు

ఈ ఊరు స్వర్ణముఖినది ఒడ్డున ఉంది. ఈ నది శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరి అటుపైన వాకాడు మీదుగా బంగాళాఖాతములో కలుస్తుంది.

జనగణన వివరాలు

ఈ పట్టణ జనాభా సుమారు 50 వేలు.

పరిపాలన

నాయుడుపేట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-16) మీద చెన్నై-నెల్లూరు ల మధ్య ఉంది. చెన్నై-విజయవాడ రైలు మార్గములో ఈ పట్టణం ఉంది.

విద్యా సౌకర్యాలు

  • "ఎ.ఎల్.సి.ఎమ్" ఉన్నత పాఠశాల ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పాఠశాలలో కొంతకాలం విద్యాభ్యాసం చేశాడు.[1]

వ్యవసాయం

ఈ మండలంలో ప్రధాన వాణిజ్య పంట చెరకు. దీనితోపాటుగా వరిని కుడా సాగు చేస్తారు.

పరిశ్రమలు

  • బీడీ ఫ్యాక్టరీ, ఈ బీడీ ఫ్యాక్టరి వలన సుమారు 20000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.
  • చక్కెర కర్మాగారము: ఈ చక్కెర కర్మాగారము నుండి ఇతర దేశాలకు చక్కెర ఎగుమతి అవుతుంది.
  • బి.జె.టెక్సెటైల్స్ ఫ్యాక్టరి: నాయుడుపేటకు సుమారు 7కి.మి దూరంలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు

  • హజరత్ షా వలి దర్గా: ఈ దర్గాకి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా గంథమహొత్సవం (ఉర్సు) జరుగుతుంది.
  • కరిమాణిక్యస్వామి ఆలయం, తుమ్మూరు (గ్రామీణ)
  • స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం ఉంది.
  • పోలేరమ్మ ఆలయం: నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ. ఊరిలో పోలేరమ్మ జాతర ఘనంగా చేస్తారు. ఇంకా ఇక్కడ అంకమ్మ గుడి, మూకాంబిక గుడి, మహాలక్ష్మి గుడి, పెద్దపాలెమ్మ గుడి, కావమ్మ గుడి ఉన్నాయి.

వ్యక్తులు

మూలాలు

  1. టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ నా జీవిత యాత్ర పుట 7

వెలుపలి లింకులు

Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya