న్యాయవాది
న్యాయవాది ని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు. న్యాయస్థానంలో కక్షి (వాది), ప్రతికక్షి (ప్రతివాది) దారుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున ఒకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించేవాడు న్యాయవాది. ఇతనిని ప్లీడరు, వకీలు, అడ్వకేటు అని కూడా పిలుస్తారు. వ్యాజ్యాలు రెండు రకాలు. ఒకటి సివిల్, మరొకటి నేరసంబంధమైన క్రిమినల్. సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని, నేరాలకు సంబంధించిన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ న్యాయవాది అంటారు. న్యాయవాది ఏదైనా న్యాయశాస్త్రేతర రంగంలో పట్టభద్రుడై వుండి (బి.ఎ; బి.కాం; బి.ఎస్సి), ఆపై న్యాయశాస్త్రంలో (ఎల్.ఎల్.బి నందు) కూడా పట్టభద్రుడైవుండాలి. గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి, చట్టంలోని విషయాల పట్ల పూర్తి అవగాహన వుండాలి. మంచి వాదన పటిమ వుండాలి. బార్ ఆసోసియేషనులో సభ్యత్వముండాలి. న్యాయవాదులకు డ్రస్‍కోడ్ ఉంది. తెల్లచొక్కా మీద, తెల్ల ప్యాంటు ధరించి, పైన నల్లకోటు ధరించాలి.
ఉదా: భూతగాదాలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, ఆర్థిక మోసం, కుటుంబ తగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
ఉదా: ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం, ప్రాణహాని కల్గించడం, దోపిడి, గాయ పరచి దొంగలించడం, దొంగతనం, మాదకద్రవాల అమ్మకం, దొంగనోట్ల మార్చుట, గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసుల క్రిందికి వస్తాయి. చిత్రమాలిక
ఇవి కూడా చూడండిమూలాలుబయటి లింకులు |