బార్కస్
బార్కస్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది పాతబస్తీలో ఉంది. "బార్కాస్" అనే పేరు ఆంగ్ల పదం "బ్యారక్స్" అనే పదం నుండి వచ్చిందని చెపుతారు. భారత స్వాతంత్ర్యానికి ముందు, బర్కాస్ హైదరాబాద్ నిజాం మిలిటరీ బ్యారక్స్ గా పనిచేశారు. చరిత్రతన కుటుంబాన్ని కాపాడటానికి వచ్చినప్పుడు, 7వ నిజాంకు ఈ అరబ్ బాడీగార్డ్‌లపై సంపూర్ణ నమ్మకం ఉందని చెబుతారు.[1] డెక్కన్ రాజ్యంలో నిజాములు, తమ కుటంబ సభ్యులను రక్షించడంకోసం అరబ్ సైనికులను నియమంచుకున్నారు. ఈ అరబ్బులంతా నిజాంల వ్యక్తిగత సైన్యంలో ఎక్కువ భాగం ఉన్నారు. 'చివరి నిజాం', అరబ్బుల విధేయతను ఇష్టపడ్డాడని, అందరికంటే ఎక్కువగా వారిని నమ్మాడని చాలామంది చరిత్రకారులు పేర్కొన్నారు. దాంతో ఆ కాలంలో అరబ్ జనాభా పెరిగింది. అప్పుడు గేటెడ్ నగరం శివార్లలో ఈ ప్రాంతం ఏర్పడింది. సంస్కృతిఈ ప్రాంతంలో అరబ్ సంస్కృతి ప్రభావం ఉంటుంది.[2] తరువాత హైదరాబాద్ సంస్కృతిలో కలిసింది.[3] స్థానిక వంటకాల్లో హరీస్ అనే తీపి పదార్థం బార్కాస్‌లో మాత్రమే దొరుకుతుంది. ఇటీవలికాలంలో చికెన్ లేదా మటన్ తో తయారుచేసిన యెమెన్ రైస్ డిష్ ఈ ప్రాంతంలో ప్రాచూర్యం పొందింది. బార్కాస్ లోని రెస్టారెంట్లలో ఇది లభిస్తోంది.[4] ప్రధాన ఆకర్షణలు
మూలాలు
|