Share to:

 

యువ (పత్రిక)

కొడవటిగంటి కుటుంబరావు యువ పత్రిక స్థాపకులలో ఒకరు

యువ తెలుగు మాసపత్రిక. 1934-35 ప్రాంతంలో తెనాలి నుంచి ప్రారంభమైంది. చక్రపాణిగా ఆంధ్రులకు సుపరిచితులైన ఆలూరి వెంకట సుబ్బారావు, కొడవటిగంటి కుటుంబరావుతో కలసి ఈ పత్రికను స్థాపించారు. 1960 ప్రాంతంలో యువ హైదరాబాదు నగరానికి మార్చబడింది. కొంతకాలం ఆలూరి సుబ్బారావు కుమారుడు సుధాకర్ సంపాదకుడిగా ఉన్నాడు. 1991-1992లో ఇది మూతపడినది.

యువ పత్రిక ముఖచిత్రం చాలా కాలంగా వడ్డాది పాపయ్య వేశారు. యువలో "భావ పరిచయ పోటీ" అనే శీర్షిక ఉండేది. ఒక కార్టూన్ ప్రచురించి దానికి హాస్యంతో కూడిన వ్యాఖ్య పంపవలసిందని పాఠకులను కోరేవారు. ఉత్తమ వ్యాఖ్యకు బహుమతి ఉండేది. "క్విజ్" అని మరో శీర్షిక ఉండేది. పది ప్రశ్నలు ఒక్కొక్క దానికి నాలుగు సమాధానాలు ఇచ్చి సరైన సమాధానాన్ని గుర్తించే పద్ధతి ఉండేది. వీటికి యువ పత్రికలోని కూపన్లనే ఉపయోగించే షరతు ఉండేది. ఈ శీర్షిక వలన పాఠకుల సాహిత్య జ్ఞానం మెరుగుపడటానికి అవకాశం ఉండేది.

కొడవటిగంటి, యద్దనపూడి సులోచనారాణి వంటి అగ్రశ్రేణి రచయితలు పత్రిక ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉంచడానికి దోహదం చేశాయి. యువ 1977 నుండి ఆలూరి సుబ్బారావు గారి కలంపేరైన చక్రపాణి పేరిట ఉత్తమ నవలలు, కథలకు అవార్డులు ప్రకటించింది.

సుమారు నాలుగు దశాబ్దాల కాలం తెలుగులో కాల్పనిక సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో గురుతరమైన పాత్ర పోషించింది.

మూలాలు

వెలుపలి లంకెలు

Prefix: a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9

Portal di Ensiklopedia Dunia

Kembali kehalaman sebelumnya