జిల్లాలో ప్రధానంగా పెంగంగా నది ప్రవహిస్తుంది. పెంగంగానది జిల్లాలోని రిసొద్ తాలూకాలో ప్రవహిస్తుంది. ఇది వాశిం, హింగోలి జిల్లాల సరిహద్దులో ప్రవహిస్తుంది. పెంగంగా నదికి కాస్ నది ప్రధాన ఉపనదిగా ఉంది. కాస్ నది షెల్గాగ్ గ్రామానికి 1 కి.మీ దూరంలో పెంగంగా నదిలో సంగమిస్తుంది. అరుణావతి నది దాని ఉపనదులు వాశిం తాలూకాలో జన్మిస్తున్నాయి. తరువాత మంగ్రులి పిర్, మనొరా తాలూకాలలో ప్రవహించి యావత్మల్ జిల్లాలో ప్రవేశిస్తున్నయి. కతేపుర్నా జిల్లాలోని కొండ ప్రాంతాలలో జన్మించి ఉత్తరంగా ప్రవహించి మాలేగావ్ తాలూకాలో ప్రవహించి అకోలా జిల్లాలో ప్రవేశిస్తుంది.
నైసర్గికం
జిల్లాలో మాలేగావ్, వాషిం, మంగ్రూల్ పీర్, మనోరా తాలూకాలలో కొండ పర్వతాల వరుస ఉంది. పెంగంగా నదీముఖద్వారంలో మైదానాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా వాషిం, రిసొద్, కరంజ, మాలేగావ్, మంగ్రుల్ పీర్, మనోరా, షిర్పుర్ మొదలైన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజులు, బ్యాంకులు ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ బాలాజీ ఆలయం ఉంది. జిల్లాలో రైల్వే జంక్షన్ ఉంది. జిల్లాలో కొంత భూభాగం అరణ్యాలు వ్యాపించి ఉన్నాయి. జిల్లాలో రెండు అభయారణ్యాలు (కతేపురా వన్యప్రాణి అభయారణ్యం, కరంజ వన్యప్రాణి అభయారణ్యం) ఉన్నాయి.[1]
చరిత్ర
అయిన్-ఐ- అక్బరి (1596-97) లలో బేరర్ గురించిన వివరణలు ఉన్నాయి. అకోలా జిల్లాలోని అత్యధికభాగం అక్బర్ సొర్కార్ లేక రెవెన్యూ జిల్లా నర్నాలాలో చేర్చబడ్డాయి. సర్కార్‌లోని కొన్ని పరగణాలు బుల్ఢానా జిల్లాలో చేర్చబడ్డాయి. అక్బర్ రెవెన్యూ జిల్లా బైషిం నుండి మూడు పరగణాలు అంకోలా జిల్లాలో చేర్చబడ్డాయి. ప్రస్తుతం అక్బర్ రెవెన్యూ భూభాగం అంకోలా జిల్లాలో ఉంది. రెవెన్యూ దాదాపు 24 లక్షల రూపాయలు. జిల్లాలోని బలపుర్, షాపూర్, బషిం ప్రాంతాలు ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
రాజధాని సుల్తాన్ మురద్ సమీపంలో ఉన్న ప్రాంతం షహ్పూర్ పేరుతో నగరంగా మారింది. భాషిం ప్రాంతం స్థానిక ప్రజల నివాసంగా ఉండేది. హత్కారి లేక ధంగర్ లేక రాజపుత్రులు అనబడే ఇక్కడి ప్రజలు గర్వంగా, ఎవరికి లొంగని మొడితనం కలిగి ఉండేవారని వ్రాయబడింది.
జిల్లా రూపకల్పన
వాశిమ్ జిల్లా 1998 జూలై 1 న రఒందించబడింది. గతంలో వాశిం వత్సగుల్మా అని పిలువబడేది. వత్సగుల్మాకు రాజ్యానికి ఒకతక రాజధానిగా ఉండేది. 1905లో బ్రిటిష్ పాలనలో వాశిమ్ జిల్లా రెండుగా (అకోలా జిల్లా, యావత్మల్ జిల్లా) విభజించబడింది. 1998లో తిరిగి వాశిమ్ జిల్లా రఒందించబడింది.
రితాద్ వాశిమ్ జిల్లాలోని ఒక గ్రామం. తితాద్ వాశిం పట్టణానికి 17 కి.మీ, రిసోద్‌కు 23 కి.మీ దూరంలో ఉంది. రితాద్ జనసంఖ్య 4,000. ఇక్కడ అధికంగా మరాఠీ - కుంబి - దేశ్ముఖ్ ప్రజలు అధికంగా ఉన్నారు. వీరికి అధికంగా బోర్కర్, ఆరు, దేశ్ముఖ్, సర్నైక్ అని ఉపనామాలు ఉంటాయి. వీరిలో అధికంగా ఉపాద్యాయులు, వ్యవసాయదారులు ఉన్నారు. ఈ గ్రామంలో 500 మంది ముస్లిములు ఉన్నారు. గ్రామంలో రెండు మసీదులు, ఒక ముస్లీం శ్మశానం ఉన్నాయి. ఇక్కడ ముస్లిములు తోటల పెంపకం, చిన్న తరహా వ్యాపారం చేస్తుంటారు. ఇక్కడ ముస్లిములు తరతరాలుగా జీవిస్తున్నారు. వీధిలో సయ్యద్, పఠాన్, షైక్, షాహ్ ప్రజలు ఉన్నారు