సాసారామ్
సాసారాం బీహార్ రాష్ట్రం రోహ్‌తాస్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. దీన్ని సహస్రారామం అని కూడా అంటారు. పురాతన కాలంలో, గయ, రాజగృహ, నలందా ప్రాంతాల "విహార" సందర్శకులకు ఇది ప్రవేశ ద్వారంగా ఉండేది. బుద్ధుడు గయలోని మహాబోధి చెట్టు క్రింద జ్ఞానోదయం పొందటానికి ఈ మార్గం లోనే వెళ్ళాడు. వేద యుగంలో, సాసారాం పురాతన కాశీ రాజ్యంలో ఒక భాగం. సాసారాం పేరు సహస్రరామం నుండి ఉద్భవించింది. దీని అర్థం వెయ్యి తోటలు అని. ఇది షేర్ షా సూరి జన్మస్థలం కాబట్టి, ఒక సమయంలో దీన్ని షా సెరాయ్ అని కూడా అనేవారు. దీని అర్థం రాజు గారి స్థలం అని. మొఘల్ చక్రవర్తి హుమాయున్ను ఓడించిన తరువాత, ఆఫ్ఘన్ రాజు షేర్ షా సూరి దాదాపు ఉత్తర భారతదేశం మొత్తాన్నీ ఐదేళ్ల పాటు పాలించాడు. షేర్ షా సూరి ప్రవేశపెట్టిన అనేక పాలనా పద్ధతులను మొఘలులు, బ్రిటిషు వారూ అనుసరించారు. కాబూల్ నుండి బెంగాల్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించినది అతడే. పట్టణంలో షేర్ షా సూరి సమాధి ఉంది. దీన్ని 122 అడుగుల ఎత్తున ఇండో-ఆఫ్ఘన్ శైలిలో, ఎర్ర ఇసుకరాతితీ నిర్మించారు. సాసారాంలోని ఒక కృత్రిమ సరస్సు మధ్యలో ఉంది. ఇది ఒకప్పుడు ఇరానియన్ ప్రభావాన్ని సూచించే నీలం, పసుపు రంగులో మెరిసే పలకలతో కప్పబడి ఉండేది. భారీ స్వేచ్ఛా గోపురం మౌర్య కాలం నాటి బౌద్ధ స్థూప శైలి యొక్క సౌందర్య కోణాన్ని కూడా కలిగి ఉంది. షేర్ షా తండ్రి హసన్ ఖాన్ సూరి సమాధి కూడా సాసారాం సమీపంలో, సుఖా రౌజా అని పిలువబడే షేర్గంజ్ వద్ద పచ్చటి మైదానం మధ్యలో ఉంది. షేర్ షా సమాధికి వాయవ్య దిశలో ఒక కిలోమీటరు దూరంలో అతని కుమారుడు, వారసుడూ అయిన ఇస్లాం షా సూరి యొక్క అసంపూర్ణమైన, శిథిల సమాధి ఉంది.[2] సాసారాంలో చక్రవర్తి భార్యలు స్నానం చేయడానికి ఉపయోగించే కొలను, బౌలియా కూడా ఉంది, . రోహ్తాస్‌గఢ్ లోని షేర్ షా సూరి కోట సాసారాం నుండి 90 కి, మీ. దూరంలో ఉంది. ఈ కోట చరిత్ర సా.శ. 7 వ శతాబ్దం నాటి నుండి ఉంది. తన కుమారుడు రోహితాశ్వా పేరిట నిజాయితీకి పేరుగాంచిన రాజా హరిశ్చంద్ర దీనిని నిర్మించాడని ప్రతీతి. ఇందులో చురాసన్ ఆలయం, గణేష్ ఆలయం, దివాన్-ఎ ఖాస్, దివాన్-ఎ-ఆమ్, వివిధ శతాబ్దాల నాటి అనేక ఇతర నిర్మాణాలు ఉన్నాయి. అక్బర్ పాలనలో బీహార్, బెంగాల్ గవర్నర్‌గా ఉన్న రాజా మాన్ సింగ్‌కు ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేసింది. ప్రస్తుత పాకిస్తాన్ పంజాబ్‌లోని జీలం సమీపంలో ఇదే పేరుతో మరో కోట ఉంది. హుమయూన్ హిందుస్తాన్ నుండి బహిష్కరించబడిన కాలంలో, సాసారాంలోని రోహ్తాస్ కోటను షేర్ షా సూరి పునర్నిర్మించాడు. భౌగోళికంసాసారాం 24°57′N 84°02′E / 24.95°N 84.03°E వద్ద, [3] సముద్ర మట్టం నుండి 200 మీటర్ల ఎత్తున ఉంది. శీతోష్ణస్థితిసాసారాం రెండు వైపులా కొండలు ఉన్నందున, దాని శీతోష్ణస్థితి కాలానుగుణంగా ఉంటుంది. సాపేక్షంగా అధిక ఉష్ణోగ్రతలు, ఏడాది పొడవునా ఉండే అవపాతం ఇక్కడీ శీతోష్ణస్థితి విశేషాలు. ఈ శీతోష్ణస్థితిని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఉప రకం " Cfa " (తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం) గా వర్గీకరించారు [4]
జనాభా2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సాసారాం పట్టణ ప్రాంత జనాభా 2,47,408. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. సాసారాం అక్షరాస్యత 80.26%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 85%, స్త్రీల అక్షరాస్యత 75%. పట్టణ జనాభాలో 13% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[6] రవాణారోడ్లుసాసారాంకు చక్కటి రోడ్లు, రైలు మార్గాల సౌకర్యం ఉంది. జాతీయ రహదారి 19 (గ్రాండ్ ట్రంక్ రోడ్ ) నగరం గుండా వెళుతుంది. స్థానిక రవాణాలో ప్రధానమైనది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులు, ప్రైవేట్ బస్సులు. జాతీయ రహదారి 19 వాయవ్య దిశలో వారణాసి, మీర్జాపూర్, అలహాబాద్, కాన్పూర్ ల ద్వారా ఢిల్లీని, తూర్పున గయా, ధన్‌బాద్ మీదుగా కోల్‌కతానూ కలుపుతుంది. సాసారాం నుండి న్యూ ఢిల్లీ, పాట్నా, బొకారో, రాంచీ, టాటాకు అనేక ఎసి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రైల్వేసాసారాంలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. స్టేషన్ 8 నుండి 9 ప్లాట్‌ఫారమ్‌లతో A + క్లాస్ వర్గానికి చెందినది. ఇది నగరం మధ్యలో గ్రాండ్ ట్రంక్ రోడ్డులో ఉంది. సాసారాం లోని ఇతర స్టేషన్లు శివసాగర్, కుమాహు, నోఖా, కార్వాండియా, పహ్లెజా, సోనేలోని డెహ్రీ. పట్టణ ప్రముఖులు
మూలాలు
|