స్వప్న (నటి)
స్వప్న ఖన్నా భారతీయ సినిమా నటి. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో 1980లు, 1990ల ప్రారంభంలో ఆమె నటించింది. ఆమె అసలుపేరు మంజరి ధోడి కాగా దర్శకుడు, నిర్మాత అనిల్ శర్మ సినిమారంగంలో స్వప్న పేరు పెట్టాడు. కెరీర్స్వప్న తన కెరీర్‌ని పీజీ విశ్వంభరన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం సంఘర్షం (1981)తో ప్రారంభించింది. ఆ తర్వాత, ఆమె మలయాళ భాషా చిత్రాలతో పాటు పలు తమిళ, తెలుగులో నటించింది.[1] ఆమె తేరీ మెహెర్బానియన్, దక్ బంగ్లా, హుకుమత్, ఇజ్జత్దార్, జనమ్ సే పెహ్లే వంటి ఇతర భాషా చిత్రాలలో కూడా నటించింది. ఆదిత్య పంచోలి నటించిన ఖతిల్ (1988)లో ఆమె అతిథి పాత్ర పోషించింది. ఆమె 1993లో తన వివాహం తర్వాత చిత్ర పరిశ్రమను విడిచిపెట్టి, తన భర్త రామన్ ఖన్నాతో కలిసి సంగిని ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించింది. దీని ద్వారా విదేశాలలో బాలీవుడ్, భారతీయ శాస్త్రీయ నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారి ప్రదర్శనలలో ప్రముఖంగా షామ్-ఇ-రంగీన్, డ్రీమ్‌గర్ల్స్ ఆఫ్ బాలీవుడ్ ఉన్నాయి. దీనితో పాటు ఆమె ముంబైలోని కర్జాత్‌లో ఉన్న "ది బ్రూక్ ఎట్ ఖన్నాస్" అనే రిసార్ట్‌ను కూడా నడుపుతోంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు
మూలాలు
|