హయగ్రీవ స్వామి
హిందూమతంలో, హయగ్రీవ స్వామీ ని కూడా విష్ణు అవతారముగా భావిస్తారు.[1] హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.[ఆధారం చూపాలి] రూపంహయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి. ఏడమ చేతిలో పుస్తకము ఉంటుంది. వివరములుహయగ్రీవ సతీమణిని అయిన లక్ష్మిని మరిచి (మరిచినది బహుశః లక్ష్మి దేవి యొక్క ఒక అవతారము). భాద్రపదనెలలో వచ్చే శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు. హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవుడు. ఉన్నత చదువు, లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినప్పుడు హయగ్రీవ స్వామిని తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.
This verse is originally from the Pañcarātra Agamas but is now popularly prefixed to the Hayagriva Stotram of the 13th-century poet-philosopher Vedanta Desika. It is very popular among devotees of Hayagrīva. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ సన్నిదిలో, సత్యనారాయణ వ్రత కథ చెప్పే పండితులు పై మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు. హయగ్రీవ స్తోత్రముహయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం | నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 || హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ | తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్|| 2 || హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః | వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 || ఫలశ్రుతి : శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం | వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 || హయగ్రీవ స్వామి ఆలయాలుహయగ్రీవ స్వామి ఆలయాలు భారతదేశమంతటా అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉంది., అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో బస్టాండ్ కు కూతవేటు దూరంలో ఉంది, తమిళనాడు లోని తిరునళ్వేలి పట్టణంలో ఉన్నది బయటి లింకులువికీమీడియా కామన్స్‌లో Hayagrivaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
|