హైదరాబాద్ బుద్ధ విగ్రహం
హైదరాబాద్ బుద్ధ విగ్రహం భారతదేశంలోని హైదరాబాద్లో ఉన్న ఒక ఏకశిలా విగ్రహం. ఇది గౌతమ బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహలలో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం. టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 మీటర్ల (58 అడుగులు) ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. హైదరాబాదుకు 60 కి.మీ. దూరంలో ఉన్న రాయగిరి గుట్టల్లోని రాతితో గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలచారు. ఈ శిల్పం 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. డిసెంబరు 1992లో దీనిని ప్రతిష్ఠించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు. చరిత్ర1983, 1989 మధ్య నందమూరి తారక రామారావు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రామారావుగారు తన పదవీకాలంలో ఈ ప్రాంతపు చారిత్రిక వ్యక్తుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రమాదంఈ విగ్రహాన్ని మొదట 1990 మార్చి 10న ప్రతిష్టించే ప్రయత్నం చేయగా అది ఫలించలేదు. హుస్సేన్ సాగర్ లో 91 మీటర్లు తరలించిన తర్వాత విగ్రహం అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు మరణించారు [1][2]. చిత్రమాలికవికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
మూలాలు
|