కబీర్‌ధామ్ జిల్లా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో కబీర్‌ధామ్ జిల్లా ఒకటి. జిల్లావైశాల్యం 4447.5 చ.కి.మీ జిల్లా ప్రధానకార్యాలయాలు కవర్ధా వద్ద ఉన్నాయి. జిల్లా కేంద్రం కవర్ధాకు 18 కి.మీ దూరంలో " బొరండియో " (ఖజోరహో) ఆలయం ఉంది. కబీర్‌ధామ్ జిల్లా తూర్పు సరిహద్దులో బెమెతర జిల్లా, ముంగెలి జిల్లా, పడమర సరిహద్దులో బాలాఘాట్, మండల జిల్లా, ఉత్తర సరిహద్దులో దిండోరి జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజనందగావ్ జిల్లా ఉన్నాయి. జిల్లా ఉత్తర, పశ్చిమ సరిహద్దులో సాత్పురా పర్వతాలలోని మైకల్ ప్రవతశ్రేణి ఉంది. జిల్లా 21.32' నుండి 22.28' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80.48' to 81.48' డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. చరిత్ర1998 జూలై 2 న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొత్త జిల్లాను రూపొందించాలని నిర్ణయించింది. రాజనందగావ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి కవర్ధా తాలూకా కేంద్రంగా ఒక జిల్లాను రూపొందించింది.[1] కొత్తగా రూపొందించిన జిల్లాకు కవర్ధాను ముఖ్యపట్టణంగా చేసారు. 1998 జూలై 6 నుండి కవర్ధా జిల్లా పేరుతో కొత్త జిల్లా ఉనికి లోకి వచ్చింది.[1] పేరుమార్పిడి2003 జనవరి 17 నుండి ఈ జిల్లా పేరు కబీర్‌ధామ్గా మార్చబడింది. ధని ధాం దాస్ 600వ సంవత్సర ఉత్సవాల సందర్భంలో ఈ పేరు మార్పిడి జరిగింది. ధని ధాం దాస్ ఛత్తీస్‌గఢ్లో " కబీర్ పంత్ " స్థాపించాడు. 1803 నుండి 1903 వరకు కబీర్ పంత్‌కు చెందిన " గురూ గద్దీ పీఠ్" ఇక్కడ ఉన్నందున ఈ పేరు మార్పిడి జరిగింది. కబీర్ పంత్ 8 వ గురువు హాక్వ్ నాం సాహెబ్ " ఇక్కడ 1806లో గురు గద్దీని స్థాపించాడు. 9 వ గురువు పాక్ నాం సాహెబ్, 10వ గురువు ప్రకాత్ నాం సాహెబ్, 11వ గురువు ధీరజ్ నాం సాహెబ్ ఇక్కడే నివసించారు. 12వ గురువు ఉగ్ర్ నాం సాహెబ్ ఆధ్వర్యంలో గురు గద్ది 1903 లో కవర్ధా నుండి దమఖెడాకు మార్చబడింది. మహాబలి సింగ్ప్రస్తుత కవార్ధా ఒకప్పుడు మహాబలి సింగ్ రాజాస్థానంగా ఉండేది. ఈ రాజాస్థానం 1751 లో మహాబలి సింగ్ చేత స్థాపినబడింది. 1895 లో కవర్ధా మండల జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది. 1903 లో ఇది బీజపుర్ జిల్లాలో చేర్చబడింది. 1912లో ఇది రాయ్‌పూర్ జిల్లాకు మార్చబడింది. 1948 లో ఇది దుర్గ్ జిల్లాలో భాగం అయింది. 1973 జనవరి 26న సరికొత్తగా రాజనందగావ్ జిల్లాను రూపొందించారు.[1] 1952 వరకు పండారియా తాలూకా పండారియ జమీందారీగా గుర్తించబడింది. తరువాత ఇది బిలాస్‌పూర్ జిల్లాలో భాగం అయింది. 1986 లో ఇది తాలూకాగా మార్చబడింది.[1] జిల్లా కేంద్రం కవర్ధా మొదటి జమిందార్ రియాసత్ మహాబలి సింగ్ 1751లో కవర్ధా నగరం స్థాపించబడింది. 2001 లో గణాంకాలు
భాషలుజిల్లాలో ప్రధానంగా అగారియా (ఇది ఒక ఆస్ట్రో ఆసియాటిక్ భాష) ను మైకల్ పర్వతాలలో దాదాపు 72,000 మంది మాట్లాడుతుంటారు.[5] విభాగాలుజిలా 4 తాలూకాలుగా విభజించబడింది: కబీర్‌ధామ్, బొడ్ల, సాహస్పూర్ లోహ్రా, పండరియా. ఒక్కొక తాలూకాలో అదే పేరుతో ఒక బ్లాకు ఉంది.[6] 2 విధాన సభ నియోజకవర్గాలు (కవర్ధా, పండరియా) ఉన్నాయి. మూలాలు
వెలుపలి లింకులు
|