గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు17°46′54″N 83°22′38″E / 17.78167°N 83.37722°E
గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (GITAM) ఉన్నత విద్యను అందించే సంస్థ. ఇది "గీతం విశ్వవిద్యాలయం", "గీతం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్" గా పిలువబడుతుంది. ఈ సంస్థకు భారతదేశంలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో ప్రాంగణాలున్నాయి. ఇది 1980లో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఏర్పడింది. 2007లో యు.జి.సి చట్టం 1965 లోని సెక్షను 3 ప్రకారం డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాను పొందింది. సుప్రీమ్ కోర్టు తీర్పు ననుసరించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను 2017 నవంబరు 10 న ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన పేరును జిఐటిఎఎమ్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా మార్చుకుంది.[1] ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సును అందించే మొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం. విశాఖపట్నం లోని దీని ప్రధాన ప్రాంగణం 100 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. విద్యాసంబంధిత విషయాలుఈ విశ్వవిద్యాలయం టెక్నాలజీ, ఫార్మసీ, విజ్ఞానశాస్త్రం, మేనేజిమెంటు, అంతర్జాతీయ బిజినెస్, ఆర్కిటెక్చర్, న్యాయశాస్త్రం వంటి అంశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టరల్ స్థాయిలలో 109 ప్రోగ్రాములను అందిస్తుంది.[2] ర్యాంకులు
గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (గీతం) 2018[4]లో జాతీయ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) వారి భారతదేశ విశ్వవిద్యాలయాల జాబితాలో 85వ ర్యాంకుపొందింది. అన్ని విద్యాలయాల జాబితాలో 101-150 ర్యాంకును సాధించింది.[3] ప్రాంగణాలుగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటుకు భారతదేశలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో మూడు ప్రాంగణాలున్నాయి.[5] విశాఖపట్నం ప్రాంగణంగీతం సంస్థకు విశాఖపట్నంలో రుషికొండలో 170 ఎకరాల విస్తీర్ణంగల ప్రాంగణం ఉంది. ఈ ప్రాంగణంలో మూడు ప్రధాన ఆహార క్యాంటీన్లు, కొన్ని ఫాస్టు ఫుడ్ సెంటర్లు, బహుళ-ప్రయోజన బాహ్య మైదానం, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వ్యాయామశాల, టెన్నిస్ కోర్టులకు అంతర మైదానంలో ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఈ క్రింది పాఠశాలలున్నాయి:
హైదరాబాదు ప్రాంగణంగీతం సంస్థ హైదరాబాదు ప్రాంగణం 2009 లో స్థాపించబడినది. ఇందులో ఈ క్రింది పాఠశాలలున్నాయి[6]: పాఠశాలలు
4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు
బెంగళూరు ప్రాంగణంగీతం బెంగళూరు ప్రాంగణ పరిథిలో ఈ క్రింది పాఠశాలలున్నాయి.:
విద్యార్థి కార్యకలాపాలుగీతం సంస్థలలో విద్యార్థులకు అనేక విద్యాపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇచట సాంస్కృతిక సంస్థలలో కళాకృతి, జి.స్టుడియో, జి.మాగ్, ఎ-సెల్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ వంటివి ఉన్నాయి.[7] ఆరోగ్య సంరక్షణగీతం ప్రాంగణంలో 12x5 ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఉంది. ఇచట అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ సేవలు అందిచబడతాయి. విద్యార్థులు, అధ్యాపకులకు నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందిస్తారు. 24x7 భద్రతా వ్యవస్థ ఉంది. బాలుర వసతి గృహంలో 3500 మందికి, బాలికల వసతి గృహంలో 2000 మందికి వసతి సౌకర్యం ఉంది. విజేతల దినోత్సవంగీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్‌లు సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని 2018 మార్చి 27న నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నూకల నరేందర్‌రెడ్డి పాల్గొని విద్యార్థులకు నియామక ఉత్తర్వులను అందజేశాడు. 2017-2018 విద్యా సంవత్సరంలో దాదాపు 100 దేశీయ, బహుళ జాతీ కంపెనీలు హైదరాబాద్ గీతమ్‌లో ప్రాంగణ నియామకాలు నిర్వహించి 82 శాతం మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ విద్యార్థులను ఎంపిక చేసినట్లు గీతం వర్గాలు ప్రకటించాయి. ఐబీఎం 70 మంది గీతం హైదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేయగా, అమెజాన్ 79 మందిని, జెన్‌పాక్ట్ 50 మందిని, ఎన్‌టీటీ డేటా 47 మందిని, వాల్యూ మొమెంటం ఇద్దరిని, వర్చూసా 23 మంది విద్యార్థులనూ ఎంపిక చేసినట్లు గీతం అధికారులు తెలిపారు.[8] పూర్వ విద్యార్థులు
మూలాలు
బయటి లంకెలువికీమీడియా కామన్స్‌లో Gandhi Institute of Technology and Managementకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి. |