గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను
చరిత్రఇండియన్ రైల్వే చరిత్ర టైమ్ లైన్ ప్రకారం విజయవాడ -మచిలీపట్నం రైలు మార్గము 79.61 కి.మీ. 04.02.1908 న ప్రారంభించారు. మచిలీపట్నం -మచిలీపట్నం పోర్ట్ రైలు మార్గము 3,75 కి.మీ. 01.01.1909 న ప్రారంభించారు. (విజయవాడ -మచిలీపట్నం పోర్ట్ మొత్తం 83,36 కి.మీ. గుడివాడ-భీమవరం -గుడివాడ రైలు మార్గము 65.34 కి.మీ. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఆర్-ఎస్‌ఆర్ ద్వారా 17.09.1928 న ప్రారంభించారు. మీటరు గేజ్.- గుడివాడ-మచిలీపట్నం విభాగంలో ప్రతి మార్గంలో (అటు ఇటు) రెండు అదనపు తేలికపాటి ప్యాసింజర్ రైళ్లు, అదేవిధంగా గుడివాడ-భీమవరం విభాగంలో కూడా ఒక అదనపు తేలికపాటి రైలు 1936-37 రైల్వే బడ్జెట్‌లో పరిచయం చేయబడ్డాయి. గుడివాడ-భీమవరం బ్రాడ్ గేజ్ రైలు మార్గము 08.10.1961 న రైల్వే మంత్రిన్ జగ్జీవన్ రామ్ ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నందు మొదటి సౌర శక్తితో పనిచేసే కలర్ కాంతి సంకేతాలు 2000 సంవత్సరంలో విజయవాడ డివిజను గుడివాడ స్టేషను సమీపంలోని లెవల్ క్రాసింగ్ గేట్ నం.55 వద్ద అందించబడింది. జంక్షన్గుడివాడ రైల్వే స్టేషను ఒక జంక్షన్ స్టేషను. గుడివాడ నుండి 3 దిశ (దిక్కు)లకు జంక్షన్‌గా రైలు మార్గములను కలిగి ఉంది.
స్టేషను వర్గంపిఠాపురం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[2] [3] రైళ్ళ జాబితాఈ కింది సూచించిన రైళ్ళ జాబితా గుడివాడ జంక్షన్ స్టేషను ద్వారా ప్రయాణించే ప్రత్యేకమైన భారతీయ రైల్వేలు సేవలు ఆందించేవి:
మూలాలు
బయటి లింకులు
|