నూతన్
నూతన్ సమర్థ్ బహల్ (1936 జూన్ 4 - 1991 ఫిబ్రవరి 21) హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో 80కి పైగా చిత్రాలలో నటించింది. వీటిలో ఎక్కువగా ఆమె కథానాయికగా చేసింది. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడుతుంది.[1] రొమాన్స్, సాహిత్యం, సైకలాజికల్ మొదలు సామాజిక వాస్తవిక ఇతివృత్తాలు వరకు తన సహజసిద్ధమైన నటనా శైలితో నటించి ప్రసిద్ధిచెందింది.[2] నూతన్ ఉత్తమ నటిగా రికార్డు స్థాయిలో ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోగా 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది. కెరీర్ముంబైలో చిత్రనిర్మాత కుమార్‌సేన్ సమర్థ్, సినీ నటి శోభనా సమర్థ్‌లకు జన్మించిన నూతన్ 14 సంవత్సరాల వయస్సులో 1950లో తన తల్లి దర్శకత్వం వహించిన హమారీ బేటీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. 1951లో ఆమె నగీనా, హమ్ లాగ్ చిత్రాలలో నటించింది. 1955లో సీమ చిత్రంలో ఆమె నటనకు విస్తృత స్థాయి గుర్తింపుతో పాటు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆమె 1960ల నుండి 1970ల చివరి వరకు ప్రముఖ పాత్రలను పోషించడం కొనసాగించింది. వాటిల్లో సుజాత, బాందిని, మిలన్, మెయిన్ తులసి తేరే ఆంగన్ కి, అనారీ, ఛలియా, తేరే ఘర్ కే సామ్నే, ఖందాన్, సరస్వతీచంద్ర, అనురాగ్, సౌదాగర్ చిత్రాలు మచ్చుకి చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలకుగానూ తనకు మరో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. 1980లలో నూతన్ క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించింది. ఆమె మరణానికి కొంతకాలం ముందు వరకు పని చేస్తూనే ఉంది. ఆమె సాజన్ కి సహేలీ (1981), మేరీ జంగ్ (1985), నామ్ (1986) వంటి చిత్రాలలో ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. మేరీ జంగ్‌లో ఆమె నటనకు ఆమెకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. వ్యక్తిగతంనూతన్ నావికాదళ లెఫ్టినెంట్-కమాండర్ రజనీష్ బహల్ ను 1959 లో వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు మోహ్నిష్ బహల్ ఉన్నాడు. అతను చలనచిత్ర, టెలివిజన్ నటుడు. అతని కూతురు, నూతన్ మనవరాలు ప్రనూతన్ బహల్ కూడా బాలీవుడ్ నటి. 1991లో రొమ్ము క్యాన్సర్‌తో నూతన్ మరణించింది. ఆమె భర్త 2004లో వారి అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదంలో మరణించాడు.[3] అవార్డులు, నామినేషన్లుపౌర పురస్కారం1974లో భారత ప్రభుత్వంచే దేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులుఉత్తమ నటి
ఉత్తమ సహాయ నటి
BFJA అవార్డులుఉత్తమ నటి (హిందీ)
మూలాలు
|