ప్రనూతన్ బహల్
ప్రనూతన్ బహల్ (జననం 1993 మార్చి 10) భారతీయ సినీనటి. న్యాయవాది. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటిస్తుంది. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరైన నూతన్ మనవరాలు. అలాగే సినిమా నటులైన మోహ్నిష్ బహల్, ఏక్తా సోహిని దంపతుల కుమార్తె. ప్రనూతన్ బహల్ 2019లో నోట్‌బుక్ చిత్రంతో బాలీవుడ్ అరంగేంట్రం చేసింది. దీంతో ఆమె ఉత్తమ నూతన నటీమణులు విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికి నామినేట్ అయింది. ఆ తరువాత ఆమె కామెడీ చిత్రం హెల్మెట్ (2021)లోనూ నటించి మెప్పించింది.[2] బాల్యం, విద్యాభ్యాసంప్రనూతన్ బహల్ 1993 మార్చి 10న మహారాష్ట్రలోని ముంబైలో నటులు మోహ్నిష్ బహ్ల్, ఏక్తా సోహిని దంపతులకు జన్మించింది.[3] ఆమె నటి నూతన్, రజనీష్ బహల్ ల మనవరాలు.[4] ఆమె హిందీ సీనియర్ నటి తనూజకు మనవరాలు, కాజోల్, తనీషా ముఖర్జీలకి మేనకోడలు కూడా.[5] ఆమె ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుండి లీగల్ సైన్స్ అండ్ లా (B.L.S. LLB)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యూనివర్శిటీ ఆఫ్ ముంబై నుండి మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) డిగ్రీని పొందింది. ప్రనూతన్ బహల్ ప్రొఫెషనల్ లాయర్.[6][7] కెరీర్కైరా ఖన్నా పాత్రను పోషించిన ఎసెన్షియల్ లైక్ నో అదర్(Essential Like No Other) అనే షార్ట్ ఫిల్మ్‌తో ప్రనూతన్ బహల్ తన కెరీర్‌ని ప్రారంభించింది.[8] 2019లో జహీర్ ఇక్బాల్ సరసన నోట్‌బుక్‌తో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. కాశ్మీరీ టీచర్ ఫిర్దౌస్ క్వాడ్రీగా తన నటనకు గానూ ఉత్తమ మహిళా డెబ్యూగా స్క్రీన్ అవార్డ్, ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్లను అందుకుంది.[9][10] ఆమె తర్వాత 2021లో విడుదలైన హెల్మెట్ చిత్రంలో అపరశక్తి ఖురానా సరసన నటించింది. ఇది భారతదేశంలో కండోమ్‌ల వాడకంతో ముడిపడి ఉన్న కథాంశంతో వచ్చిన చిత్రం. ఆమె పెళ్లిళ్లలో పుష్పాలంకరణను అందించే అమ్మాయి రూపాలి పాత్రను పోషించింది. ఇది ZEE5లో విడుదలైంది.[11] మూలాలు
|