పశ్చిమ చంపారణ్ జిల్లా
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో పశ్చిమ చంపారణ్ జిల్లా (హిందీ:पश्चिम चंपारण ज़िला) (ఉర్దూ : مغرِبی چمپارن ضلع)ఒకటి. బెటియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.[1] బెటియా జిల్లా తిరుహట్ డివిజన్‌లో భాగం. ఇది నేపాల్ సరిహద్దులో ఉంది. ప్రజలు ఇక్కడి నుండి సులువుగా నేపాల్‌కు వచ్చి పోతూ ఉంటారు. నేపాల్- బిర్గుంజ్ మార్కెట్లో చైనా, కొరియా, జపాన్ తయారీ వస్తువులు లభిస్తుంటాయి. ప్రజలు పుట్టిరోజు, న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి నేపాల్‌కు పోతుంటారు. నేపాల్ ఇక్కడి ప్రజల నుండి వ్యాపార ఆదాయం లభిస్తుంది. చంపారణ్య ప్రజలు బిర్గుంజ్ వద్ద మెడికల్ కాలేజీని స్థాపించారు. చరిత్ర1972లో పశ్చిమ చంపారణ్ జిల్లా పాత చంపారణ్ జిల్లానుండి రూపొందించబడింది. ముందు ఇది సారణ్ జిల్లాలో డివిజన్‌లో భాగం. తరువాత చంపారణ్ జిల్లాలో భాగం. జిల్లాకేంద్రంగా బెటియా పట్టణం ఉంది. పేరువెనుక చరిత్రబెటియా అనే పేరు బెయింట్ (కేన్) నుండి వచ్చింది. ఈ ప్రాంతంలో కేన్ అధికంగా కనిపిస్తుంటాయి కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. చంపారణ్యం అనే పేరు కాలక్రమంగా చంపారణ్ అయింది. చంపక వృక్షాలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతానికి చంపారణ్యం అనే పేరు వచ్చింది. పాలకులుజిల్లా గజటీర్ అనుసరించి చంపారణ్యాన్ని ఆర్యులు ఆక్రమించి విదేహ రాజ్యంలో భాగంగా చేసారు. విదేహరాజ్యపతనం తరువాత వైశాలి రాజధానిగా భూభాగం వ్రిజ్జైన్ ఒలిగార్చియల్ రిపబ్లిక్ అవతరుంచింది. వ్రిజ్జైన్ ఒలిగార్చియల్ రిపబ్లిక్‌లో లిచ్చివీలు శక్తివంతులుగా ఉండి ఆధిక్యతలో ఉన్నారు. మగధరాజు ఆజాతశత్రువు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి తనబ్బూభాగంలో కలుపుకుని తనసామ్రాజ్యాన్ని చంపారణ్యం వరకు విస్తరించాడు. తరువాత వంద సంవత్సరాల కాలం ఈ ప్రాతం మౌర్యుల పాలనలో ఉంది. మౌర్యుల తరువాత మగధ భూభాగాన్ని సుంగాలు, కంవాలు పాలించారు. తరువాత ఈ భూభాగం కంవాల పాలనలోకి మారింది. తరువాత కుషన్ పాలకులు ఈ భూభాగాన్ని పాలించారు. తరువాత గుప్తులు ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు. తిరుహట్‌తో చేర్చి చంపారణ్యం హర్షవర్ధనుడి వశం అయింది. హర్షవర్ధనుడి కాలంలో చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. 750 నుండి 1155 వరకు బెంగాల్ పాలాలు తూర్పుభారతదేశం మీద ఆధిక్యం సాధించి ఈ ప్రాంతాన్ని తమ రాజ్యంలో చేర్చుకున్నారు.10వ శతాబ్దం చివరిదశలో కళాచేరి వంశానికి చెందిన గంగయదేవా చంపారణ్యం మీద విజయం సాధించాడు. తరువాత చాళుఖ్య వంశానికి చెందిన విక్రమాదిత్యుడు ఈ భాగానికి పాలకుడయ్యాడు. ముస్లిం పాలకులు1213, 1227 మద్యకాలంలో బెంగాల్ రాజప్రతినిధి జియాసుద్దీన్ ఇవాజ్ త్రొభుక్తి వరకు అధికారాన్ని కొనసాగించాడు. ఇది పూర్తిగా ఈ ప్రాంతం మీద విజయం సాధించడం కానప్పటికీ సింరాయన్ రాజైన నరసింగదేవా నుండి ఈ ప్రాంతం మీద ఆధికారాన్ని పొందాడు. 1320 నాటికి తుగ్లక్ తిరుహట్ వరకు తన సామ్రాజ్యంలో కలుపుకుని కామేశ్వర్ ఠాకూరును ఈ ప్రాంతానికి రాజప్రతినిధిని చేసాడు. తరువాత కామేశ్వర్ ఠాకూరు ఠాకూర్ సామ్రాజ్యం (సుగాన్ సామ్రాజ్యం) స్థాపించాడు. ఇది కొంతకాలం కొనసాగింది. తరువా 1530లో అల్లావుద్దీన్ కుమారుడ్జు నసరత్ షాహ్ తిరుహట్ మీద దాడి చేసి రాజాను చంపి ఠాకూర్ రాజ్యానికి ముగింపు పలికాడు. తరువాత నసరత్ షాహ్ తన అల్లుడిని ఈ ప్రాంతానికి వైశ్రాయిని చేసాడు. తరువాత ఈ ప్రాంతాన్ని ముస్లిములు పాలించారు. మొగల్ సామ్రాజ్య పతనం తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ పాలకుల వశం అయింది. బ్రిటిష్బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతం బెటియా రాజ్ ఆధిక్యతలో కొనసాగింది. బెటియా రాజ వంశం గొప్ప రాజవంశంగా గుర్తించబడుతుంది. ఇది ఉజ్జయిన్ సింగ్‌తో మొదలైంది. ఉజ్జయిన్ సింగ్ కుమారుడు గజాసింగ్ షాజహాన్ చక్రవర్తి (1528-58) నుండి రాజాపట్టం అందుకున్నాడు. 18వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్యం పతనం ఆరంభం అయ్యే వరకు ఈ రాజకుటుంబం ఈ ప్రాంతానికి స్వతంత్ర రాజప్రతినిధులుగా ఉన్నారు. తరువాత చంపారణ్యం బ్రిటిష్ పాలకుల వశం అయింది. తరువాత ఈ భూభాగం మీద అధికారం రాజా జుగల్ కిషోర్ సింగ్ వశం అయింది. 1763 నాటికి కిషోర్ సింగ్ కుమారుడు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. బ్రిటిష్ పాలనలో చివరిగా హరేంద్రసింగ్ ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. హరేంద్రసింగ్ వారసత్వరహితంగా 1893లో మరణించాడు. తరువాత ఆయన మొదటి భార్య అధికారం స్వీకరించింది. 1896లో హరేంద్రసింగ్ భార్య మరణించిన తరువాత అధికారం కోర్టుకు పోయింది. 1897 నుండి అధికారం హరేంద్రసింగ్ చిన్నభార్య మహారాణి జానకి కౌర్ హస్థగతం అయింది. 20వ శతాబ్దంబ్రిటిష్ రాజ్ ప్యాలెస్ నగరకేంద్రంలో విశాలమైన ప్రదేశం ఆక్రమించింది. 1919లో మహారాణి ప్రార్థన అభ్యర్ధన మీద కొలకత్తా లోని గ్రహం ప్యాలెస్ రూపొందించిన నిర్మాణకళాకారులచేత ఈ ప్యాలెస్ నిర్మించబడింది. ప్రస్తుతం ఇది బెటియా రాజ్ ఆధీనంలో ఉంది. గాంధీజీ20వ శతాబ్దంలో జాతీయ ఉద్యమం తీవ్రం అయిన తరువాత బెటియా రాజకీయాలు ఇండిగో (నీలిమందు) ప్లాంటేషన్‌తో ముడిపడ్డాయి. రియాత్ రాజకుమార్, చంపారణ్య ఇండిగో వ్యవసాయదారుడు గాంధీజీని కలుసుకున్నారు. వారు రైతులు, రియాత్‌ల సమస్యలను గాంధీజీ దృష్టికి తీసుకువచ్చారు. 1917లో గాంధీజి చంపారణ్యానికి వచ్చి వారి సమస్యలను స్వయంగా విని తెలుసుకున్నాడు. తరువాత చంపారణ్యంలో సత్యాగ్రహం మొదలైంది. ఇండిగో ప్లాంటర్ల అణిచివేతతో ఉద్యమం ముగింపుకు వచ్చింది. 1918 దీర్ఘకాల ఇండిగో వ్యవసాయదారులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతం స్వాతంత్ర్య సమరకేంద్రాలలో ఒకటిగా మారింది. తరువాత బెటియా పరిసర ప్రాంతాలన్ని ఇండిగో ప్లాంటేషన్ వ్యవసాయంతో నిండిపోయింది. ఇండిగో పంట మూలంగా బ్రిటిష్ వారికి అధిక ఆదాయం లభించింది. అయినప్పటికీ వ్యవసాయభూములు కలుషితమై ఇతర పంటలు పండించడానికి వీలు కాని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికీ గతంలో ఇండిగో పండించిన భూమి నిష్ఫలంగా బీడుభూమిగా మారింది. అదిప్పుడు పొదలతో నిండిన బీడుగానే ఉంది. నెహ్రూ విజయం1959లో ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ బెటియాను సందర్శించాడు. ఆసమయంలో ఈ నగరం భారతదేశ 5వ మహానగరంగా ఉండేది. బెటియా రాజ్‌లో ఉన్న 1800 చక్కెర మిల్లులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను సంతరించాయి. మిల్లులకు అద్దెగా దాదాపు 2 మిలియన్ల రూపాయలు లభ్యమౌతుంది. (బీహార్‌లో ఇది రెండవ స్థానంలో ఉంది). ఇండియాలో జమీందారీ వ్యవస్థ రద్దైన తరువాత ఇది నిషేధానికి గురైంది. భౌగోళికంచంపారణ్ జిల్లా వైశాల్యం 5228 చ.కి.మీ.[2] ఇది కెనడా దేశంలోని అముద్ రింగ్నెస్ ద్వీపం వైశాల్యానికి సమానం.[3] వృక్షజాలం , జంతుజాలం1989లో పశ్చిమ చంపారణ్ జిల్లాలో 336 చ.కి.మీ వైశాల్యంలో రెండు వన్యప్రాణి శాక్చ్యురీలు ఏర్పాటు చేయబడ్డాయి.[4] ఒకటి వాల్కిమి రెండవది ఉదయపూర్ వన్యప్రాణి అభయారణ్యం.[4] విభాగాలు
2001 లో గణాంకాలు
రావాణాసౌకర్యాలు
భాషలుజిల్లాలో బిహారీ భాషా కుటుంబానికి చెందిన భోజ్‌పురి భాష 40 000 000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. ఇది దేవనాగరి, కైథిలి లిపిలో వ్రాయబడుతుంది. [8] సంస్కృతినగరం గొప్ప సాంస్కృతిక సంపద కలిగి ఉంది. ప్రముఖ కవి గోపాల్ సింగ్ నేపాలీకి ఇది జన్మస్థలం. రాజేంద్రప్రసాద్, అనుగ్రహ్ బాబు, బ్రాజ్కిషోర్ ప్రసాద్ వంటి నాయకులతో చేరి గాంధీజి 1917లో మొదటిసారిగా ఇక్కడి నుండి సత్యాగ్రహ ఉద్యమం ఆరంభించాడు.
• ఫజ్లుర్ రహ్మన్ కంధ్వలీ కార్మిక మంత్రి
మూలాలు
బయటి లింకులు
{{Geographic location |Centre = పశ్చిమ బెంగాల్ |North = నేపాల్ |Northeast = |East = |Southeast = తూర్పు చంపారణ్ జిల్లా |South = [[గోపాల్‌గంజ్ జిల్లా], |Southwest = |West = కుశినగర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ |Northwest = మహారాజ్‌గంజ్ జిల్లా,ఉత్తర ప్రదేశ్ }} మూలాలువెలుపలి లింకులు |