మధుబని జిల్లా
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో మధుబని జిల్లా (హిందీ:) ఒకటి. మధుబని పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. మధుబని జిల్లా దర్భంగ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 3501 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 3,570,651. మిధిల భూభాగంలో ఉన్న మధుబని జిల్లాలో మైధిలి భాష వాడుకలో ఉంది. చరిత్ర1972లో దర్భంగ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి మధుబని జిల్లాగ రూపొందించబడింది.[1] భౌగోళికంభౌగోళికంగా జిల్లా వైశాల్యం 3501చ.కి.మీ.[2] ఇది బహమా దేశంలోని నార్త్ ఐలాండ్ జనసంఖతో సమానం.[3] నదులుజిల్లాలో కమల, భూతహి, బలాన్, తిరుసుల్లా, జీబచ్, కోసి, ధౌస్, ఘఘర్. ఆర్ధికం2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మధుబని జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలలో పరిస్థితిలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి.[4] 2001 లో గణాంకాలు
విభాగాలు
సంస్కృతి17వ శతాబ్దం నుండి జిల్లాలో మధుబని శైలి పెయింటింగులు జిల్లాలో ప్రత్యేకత సంతరుంచుకున్నాయి. వీటిని చిత్రించడానికి కూరగాయలు, లాంప్ బ్లాక్, కాంవాస్, పేపర్ మీద చిత్రిస్తుంటారు. ప్రస్తుతం పలు మధువని శైలి చిత్రాలను హాండు బ్లాక్ సాంకేతికత ఉపయోగించి చేసంచులు, కుర్తాలు, ఇతర వస్తువుల మీద కూడా చిత్రించబడుతున్నాయి. సంప్రదాన్ని ప్రతిబింబించే ఈ వస్తువులకు భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా గిరాకి అధికంగా ఉంది. పూర్వం భౌరా గర్, మధుబని మిథిలకు రాజధానిగా ఉండేది. సంగీతంమధుబని మఖానా, మంచినీటి చేపలకు ప్రసిద్ధి చెందునది. చిన్న చిన్న చేపలను కూడా ప్రజలు ఇష్టంగా ఆహారంగా స్వీకరిస్తారు. మధుబని లోకగీతాలు హిందూస్థాని రాగాల ఆధారితంగా ఉంటాయి. ఈ గీతాలు అధికంగా జిల్లా ప్రధాన భాష అయిన మైథిలీ భాషలో ఉంటాయి. షర్ధా సింహా పాడిన వివాహగీతాలు దాదాపు అన్ని వివాహాలలో వినపడుతుంటాయి. మతంజిల్లాలోని ప్రజలు మతవిశ్వాసం అధికంగా కలిగి ఉన్నారు. వీరు పండుగలను విశ్వాసంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. దుర్గాపూజ, హోలి, రామనవమి, కృష్ణాష్టమి, దీపావళి, చాత్ వంటి పండుగలను జరుపుకుంటారు. మౌయాహి, బాబుబర్హి బ్లాక్ లలో కృష్ణుని విగ్రహాలు, నందబాబా, ఇతర దైవాల విగ్రహాలను మట్టితో మరొయు వెదురుతో చేసి కృష్ణాష్టమి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ జిల్లాలోని మొత్తం గ్రామాలలో శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో రోజూ జలాభిషేకం చేస్తుంటారు. ప్రజలుఈ జిల్లాప్రజలు సాధారణంగా సౌమ్యులుగా ఉంటారు. ఈ జిల్లాకు వలసవచ్చి జీవిస్తున్న ప్రజలో అధికులు తక్కుగా చదువుకున్నవారు ఉన్నారు. వ్యాపార, వాణిజ్యాలలో కూడా విద్యాధికులు తక్కువగానే ఉంటారు. పండుగలుముస్లిములు ముహరం వంటి పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. హిందువులు కూడా ఈ పండుగలలో పాల్గింటారు. సౌరాత్ సభప్రతిసంవత్సరం మిథిలా నగరంలో వివాహాలు నిర్ణయించడానికి సురహ్ సభ నిర్వహించబడుతుంది. ఈ వేలాది మైథిల్ బ్రాహ్మణులు వివాహాలు నిర్ణయించడానికి హాజరౌతారు. ఇందులో పంజికర్ (జననాల చిట్టా నిర్వహణదారుడు) ప్రధాన పాత్ర వహిస్తారు. వివాహంచేయడానికి అభ్యర్థించిన వారి జాబితాను అనుసరించి వివాహాలు నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోలనుకునేవారు పంజికర నుండి అస్వజనపత్రం (రక్తసంబంధ రహిత పత్రం) పొందాలి. వరునికి వధువుకు మద్య బంధుత్వం లేదని నిర్ణయించే పత్రం. మైథిలి ప్రజలలో రక్తసంబధీకులలో వివాహాలు నిషిద్ధం. ఈ సభలో వివిధగ్రామాల ప్రజల వివాహం నిర్ణ్యించబడుతుంది.పంచాంగం ఆధారంగా వివాహ తేదీలు నిర్ణయించబడతాయి. మూలాలు
బయటి లింకులు
మూలాల జాబితావెలుపలి లింకులు |