ప్రణయ్‌రాజ్ వంగరి, ఫిల్మ్ మేకర్, తెలుగు నాటక రంగ పరిశోధకుడు,[1] తెలుగు వికీపీడియా నిర్వాహకుడు. వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న "పాప్ కార్న్ థియేటర్"కు ప్రధాన కార్యదర్శి.[2][3] 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు.[4][5][6][7][8] ఆ ఛాలెంజ్‌ను అలాగే కొనసాగిస్తూ 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాడు. 2022, మార్చి 1 నాటికి 2000 రోజులు - 3015 వ్యాసాలు పూర్తిచేశాడు.[9] అయన 2024 నవంబర్ 24 నాటికీ 7903 పూర్తి వ్యాసాలు పూర్తి చేశాడు.[10]
జననం
ప్రణయ్ 1985, మార్చి 25నయాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ లో చేనేత కార్మికులైన వంగరి జానయ్య, కళమ్మ దంపతులకు జన్మించాడు.[11] తండ్రి జానయ్య సినీ అభిమాని, మహారాష్ట్రలోనిసోలాపూర్ లో ఉన్నప్పుడు ఒక్కో తెలుగు సినిమాను 20-30 సార్లు చూసేవాడు, తల్లి కళమ్మ పెండ్లి అప్పగింత పాటలు, బతుకమ్మ పాటలు పాడుతుండేది. వాళ్ళ కళను చూసి ప్రణయ్ కి కళారంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. రేడియోలో పాటలు వినడంతోపాటు సినిమా పాటల పుస్తకాలలో చూసి పాడటం నేర్చుకొని స్కూల్లో, వినాయక చవితి ఉత్సవాల్లో, ఊర్లో ఎవరిదైనా పెండ్లి అయితే వెళ్ళి అక్కడ పాటలు పాడేవాడు.[12]
విద్యాభ్యాసం
మోత్కూర్‌లోని స్థానిక ఉన్నత పాఠశాల్లో పదివరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, భువనగిరిలోని ఎస్.ఎల్.ఎన్.ఎస్. కళాశాలలో డిగ్రి పూర్తి చేసాడు. చిన్నతనం నుండి కళారంగంపై ఆసక్తి ఉండటంతో హైదరాబాద్ వెళ్ళి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాటకరంగం (థియేటర్ ఆర్ట్స్) లో పీ.జీ. పూర్తిచేసి, తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాడు.[13]
తొలినాళ్ళలో
2006లో హైదరాబాదులో అడుగుపెట్టిన ప్రణయ్, హబ్సిగూడలోని హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చేసాడు. 2009లో సినిమా ఎడిటింగ్ నేర్చుకొని, కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌కి ఎడిటింగ్ చేసాడు.
రంగస్థల ప్రస్థానం
చిన్నప్పుడు ఊర్లో చిందు భాగవతాలు.. పౌరాణిక నాటకాలు చూసి తన ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న చిన్న స్కిట్స్ వేసేవాడు. దాన్ని కొనసాగిస్తూ 2009లో తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళాలశాఖ లోని ఎం.పి.ఏ.లో చేరాడు.
నటించినవి - దర్శకత్వం చేసినవి
నాటికలు: మాయ, ఆంటీగని, డింభకరాజ్యం, పిపీలకం, కల్పితం... కాని నిజం, సంభవామి పదేపదే, శ్రీకృష్ణదేవరాయలు, లయ, ఒహోం ఒహోం భీం, చీమకుట్టిన నాటకం, నేనేడుస్తున్న మీరు నవ్వుకోండి, అంతిమ సంస్కారం, రచ్చబండ (నాటిక).
2009లో శాస్త్రా విశ్వవిద్యాలయం, మైసూర్ లో జరిగిన దక్షిణ భారత యువజనోత్సవాలలో పాల్గొన్నాడు.
2010లో తంజావూర్ విశ్వవిద్యాలయం, తంజావూరులో జరిగిన దక్షిణ భారత యువజనోత్సవాలలో పాల్గొన్న ప్రణయ్ బృందం, మూఖాభినయ పోటీలో మొదటి బహుమతిని... 2011లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన అఖిల భారత యువజనోత్సవాలలో రెండవ బహుమతిని సాధించింది.
థియేటర్ ఔట్రీచ్ యూనిట్
యువ నాటకరంగాన్ని ప్రోత్సహించడంకోసం 2012లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళాలశాఖ ఆధ్వర్యంలో డా. పెద్ది రామారావు సమన్వయకర్తగా ఏర్పాటుచేసిన థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా చేరి, 2017 వరకు అందులో పనిచేశాడు. అలా ప్రణయ్‌కి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నాటకసంస్థలతో, నాటక ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. టి.ఓ.యు. నిర్వహించిన వివిధ నాటకోత్సవాలకు, నాటకరంగ శిక్షణా కార్యక్రమాలకు నిర్వహకుడిగా పనిచేసాడు.
పాప్‌కార్న్ థియేటర్ స్థాపన
2014, ఫిబ్రవరి 17-23 వరకు న్యూఢిల్లీలో జరిగిన టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవంలో పాల్గొన్న ప్రణయ్, తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది మిత్రులతో కలిసి 2014, మార్చి 20న హైదరాబాదు అబీడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో అమ్మ చెప్పిన కథ అనే నాటిక ప్రదర్శనతో పాప్‌కార్న్ థియేటర్ ను ప్రారంభించాడు. ఆ పాప్‌కార్న్ థియేటర్ ద్వారా చిన్నారులను, యువతను నాటకరంగంవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.[14]
ఇతర నాటకసంస్థలు
1. దక్కన్ థియేటర్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉంటూ, తెలంగాణలో రంగస్థల విద్యను చదివినవారికి ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో ఆధ్యాపకులుగా నియామకంకోసం ప్రయత్నిస్తున్నాడు.
2. తెలంగాణ రంగస్థల సమాఖ్యకు కోశాధికారిగా ఉంటూ తెలంగాణ నాటకరంగ చరిత్రను వెలికితీస్తూ, తెలంగాణలో యువ నాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు.
టీవీరంగ ప్రస్థానం
2010లో జెమినీ టీవీలో వచ్చిన "దేవత", 2015లో దూరదర్శన్ లో వచ్చిన "చంటిగాడు స్వయంవరం" ధారావాహికలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.
చలనచిత్ర రంగం
2015లో వచ్చిన "ఎ-ఫైర్" చిత్రానికి ప్రచారకర్తగా, 2017లో వచ్చిన "అవంతిక" చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసాడు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ పర్యవేక్షణలో రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా జరిగే వివిధ సినిమా కార్యక్రమాలకు కో-ఆర్డినేటర్‌గా చేస్తూ తెలంగాణ సినిమా నిర్మాణానికి కృషి చేస్తున్నాడు.
తెలుగు వికీపీడియాలో సేవలు
తనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు అందించే అలవాటున్న ప్రణయ్, తెలుగు భాషాభివృద్ధి చేయాలనే తలంపుతో 2013, మార్చి 8న తెలుగు వికీపీడియాలో చేరాడు. వికీపీడియాలో అనేక నాటకరంగ ప్రముఖులు, తెలుగు ప్రముఖుల, తెలంగాణ అంశాల వ్యాసాలతోపాటు అనేక విశేష వ్యాసాలను రాసి విజ్ఞాన సర్వస్వాన్ని భాషాభిమానుల చేరువకు చేరుస్తున్నాడు.[15] వికీ శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు 2016, నవంబరు 8వ తేదిన తెలుగు వికీపీడియా నిర్వాహకుడి హోదా వచ్చింది.
2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు, 2015లో తిరుపతిలో జరిగిన పదకొండో వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాడు.[16][17]
2016, జూన్‌లో ఇటలీలోని ఏసినో లారియోలో జరిగిన వికీమేనియా-2016 కార్యక్రమంలో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాడు.
2016, ఆగస్టులో చండీగఢ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని, పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించడంలో సహచరులతో పాటు విశేష కృషిచేసాడు.
తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తూనే వికీపీడియా శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు.
తెలుగు వికీపీడియా గురించి అందరికి తెలిసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నాడు. ప్రణయ్ కృషిని గుర్తించిన వికీమీడియా పౌండేషన్ వారు ప్రతి ఏటా నిర్వహించే వికీపీడియా అంతర్జాతీయ సదస్సులో భాగంగా 2016లో ఇటలీలో నిర్వహించిన "వికీమేనియా 2016"కు ఆహ్వానించారు.[18]
ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వికీపీడియాలో జరుగుతున్న 100 రోజులు -100 వికీవ్యాసాలు అనే ఛాలెంజ్‌ను ప్రణయ్ పూర్తిచేసాడు. సెప్టెంబరు 8, 2016 నుండి డిసెంబరు 16, 2016 మధ్యకాలంలో 100 వికీ వ్యాసాలు పూర్తిచేసాడు.[19][20]
వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు.[21] 2016, సెప్టెంబరు 8న తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రణయ్‌కు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందనలు తెలిపాడు.[22] రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అభినందనలు తెలుపడమేకాకుండా ప్రగతి భవన్ లోని తన ఛాంబర్‌లో సత్కరించాడు.[23]
2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాడు.[24][25]
2020, అక్టోబరు 17 నాటికి 1500 రోజులు - 1500 వ్యాసాలు పూర్తిచేశాడు.[26]
2022, మార్చి 1 నాటికి 2000 రోజులు - 3015 వ్యాసాలు పూర్తిచేశాడు. అలాగే మరింత ముందుకు ఈ వికి ఛాలెంజ్ సాగుతూనే ఉంది.
2021లో తెలుగు వికీపీడియా ప్రాజెక్టు గ్రాంట్‌కు ఎంపికయ్యాడు.[27][28][29]
పురస్కారాలు
లోకలైజేషన్ (స్థానికీకరణ) అవార్డు - 2018: 2018 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న తెలంగాణ ప్రభుత్వ సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ నిర్వహించిన వార్షిక నివేదిక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతలమీదుగా లోకలైజేషన్ (స్థానికీకరణ) విభాగంలో తొలి అవార్డును ప్రణయ్ అందుకున్నాడు.[30]
ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ - శ్రేష్ఠ పేవా పురస్కారం 2019 (గాంధీ జయంతి వేడుకలు, తారమతి బరాదారి, హైదరాబాదు. 02.10.2019)
తెలంగాణ జాతీయ పురస్కారం - 2017 (తెలంగాణ కళాపరిషత్, ఖమ్మం వారి తెలంగాణ దసరా వేడుకలు-2017. 24.09.2017) - తెలుగు వికీపీడియా కృషి[31][32][33]
తెలంగాణ ప్రతిభా పురస్కారం - 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) - తెలుగు వికీపీడియా కృషి[34][35]
తెలంగాణ ఉగాది పురస్కారం - 2017 (తెలంగాణ కళాపరిషత్, ఖమ్మం. 19.03.2017) - తెలుగు వికీపీడియా కృషి[36]
చిత్రమాలిక
2021 హైదరాబాదు బుక్ ఫెయిర్ లో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ తో
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ యువ నాటకోత్సవంలో 2018 మే 27న పాల్గొన్న ప్రణయ్‌రాజ్ వంగరికి సత్కారం (చిత్రంలో మామిడి హరికృష్ణ, కోట్ల హనుమంతారావు, వేణు ఊడుగుల, నటరాజమూర్తి, శ్రీజ సాధినేని)
↑నమస్తే తెలంగాణ, జిందగీ న్యూస్ (19 September 2017). "వికీ వ్యాసాల ప్రణయ్". Archived from the original on 19 September 2017. Retrieved 4 October 2017.
↑ఈనాడు, ప్రత్యేక కథనాలు (18 September 2017). "వికీపీడియాలో తెలుగు వెలుగు". Archived from the original on 18 సెప్టెంబరు 2017. Retrieved 4 October 2017.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
↑"రోజుకో వ్యాసం.. ప్రణయ విన్యాసం". Eenadu. 21 December 2024. Archived from the original on 21 డిసెంబర్ 2024. Retrieved 21 December 2024. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: bot: original URL status unknown (link)
↑ఈనాడు, ప్రధానాంశాలు (28 March 2021). "చరిత్రలో మనకో పేజీ". www.eenadu.net. Archived from the original on 2 April 2021. Retrieved 2 April 2021.
↑నమస్తే తెలంగాణ, లైఫ్ స్టోరి (బతుకమ్మ ఆదివారం సంచిక) (12 July 2020). "వికీపీడియానే.. ప్రణయ్ రాజ్యం!". ntnews. దాయి శ్రీశైలం. Archived from the original on 13 July 2020. Retrieved 13 July 2020.