మాహె జిల్లా
మాహె జిల్లా, భారత కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని నాలుగు జిల్లాలో ఇది ఒక జిల్లా.దీనిని ఫ్రెంచ్ పరిపాలనలో డి మహే జిల్లా అనేవారు.ఈ జిల్లా వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు.[1] మాహే జిల్లా మొత్తం కేరళ లోని ఉత్తర మలబార్ మద్యలో ఉపస్థితమై ఉంది.మూడు దిశలలో కన్నూర్ (కేరళ) జిల్లా ఉంది. ఒక దిశలో మాత్రం కేరళ రాష్ట్రానికి చెందిన కోళికోడు జిల్లా ఉంది. అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మాహె జిల్లా 6 వ స్థానంలో ఉంది.[2] విస్తీర్ణ పరిమాణం ప్రకారం ఇది భారతదేశంలో అతిచిన్న జిల్లా.[3]మహే జిల్లాలో హిందూ మతానికి చెందిన ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.ఆ తరువాత ముస్లిం మతానికి చెందిన వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. భౌగోళికంమాహే జిల్లా వైశాల్యం 8.69 చదరపు కిలోమీటర్లు.[4][5] జిల్లాలో తాలూకాలు
గణాంకాలు2011 భారత జనాభా లెక్కల అనుసరించి మాహే జిల్లా జనసంఖ్య 41,934.[2] ఇది దాదాపు లిక్తెన్స్తీన్ దేశ జనసంఖ్యతో సమానం.[6]భారతీయ జిల్లాలు (640) లలో మాహే జిల్లా 635వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 4,659.[2] గా ఉంది. జిల్లా కుటుంబనియంత్రణ శాతం 13.86%.[2] జిల్లా స్త్రీపురుష శాతం 1176:1000.[2] అలాగే జిల్లా అక్షరాస్యతా శాతం 98.35% గా ఉంది.[2] మతాల వారీగా ప్రజలు2011 భారత జనాభా లెక్కల ప్రకారం మాహే జిల్లాలో హిందూ మతానికి చెందిన వారు 66.82% మంది, ఇస్లాం మతానికి చెందిన వారు 30.74% మంది, క్రైస్తవ మతానికి చెందిన వారు 2.29% మంది, ఇతర లేదా ఏ మతం గుర్తించని వారు 0.55% మంది ఉన్నారు. పర్యాటకంశ్రీ పుతంలం భాగవతి ఆలయం
మూప్పెంకును (చిన్న కొండ)
మహే నది వద్ద నడక మార్గం
అజిముఖం నది
భౌగోళిక స్థానంమూలాలు
వెలుపలి లంకెలువికీమీడియా కామన్స్‌లో Mahe districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి. |