కపి స్థలమ్ ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
విశేషాలు
ఈ దివ్య దేశానికి 5 కి.మీ. దూరములో ఉమయాపురమునకు పోవు మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల జన్మస్థలమైన మణ్డజ్గుడి క్షేత్రము ఉంది.
మార్గము
కుంభఘోణం - పాపనాశం టౌను బస్. పాపనాశం నుండి 3 కి.మీ. కుంభఘోణం - తిరువయ్యారు బస్ మార్గమున 20 కి.మీ. సత్రములు ఉన్నాయి.
సాహిత్యంలో కపి స్థలమ్
శ్లోకము:
శ్రీ మద్గజేంద్ర సరసీ కపిలాఖ్య తీర్థ | సంశోభితే శుభ కపిస్థల దివ్యదేశే |
దేవ్యా రమామణిలతాహ్వయయా సమేతో | దేవో గజేంద్ర వరదో భుజగేంద్ర శాయీ |
శ్లోకము:
వైమానమస్య వర కారక నామధేయం | దేవేశ దిగ్వదన సంస్థతి శోభమానః |
నాగాధిరాజ మరుదాత్మజ సేవితాజ్గః | శ్రీ భక్తిసారమునిరాజ నుతో విభాతి |
పాశురము:
కూత్తముమ్ శారా కొడువినైయుమ్ శారా; తీ
మాత్తముమ్ శారా వగై అణిన్దేన్ - ఆళజ్
కరై కిడక్కుమ్ కణ్ణన్ కడల్ కిడక్కుమ్
మాయన్ ఉరైక్కిడక్కుం ఉళ్ళత్తెనక్కు... తిరుమళశై ఆళ్వార్ - నాన్ముగన్ తిరువన్దాది 50 పా.
వివరాలు
ప్రధాన దైవం పేరు
|
ప్రధాన దేవి పేరు
|
తీర్థం
|
ముఖద్వార దిశ
|
భంగిమ
|
కీర్తించిన వారు
|
విమానం
|
ప్రత్యక్షం
|
గజేంద్ర వరదన్
|
రమామణి వల్లి తాయార్, పాఱ్తా మరైయాళ్
|
గజేంద్ర పుష్కరిణి, కపిల తీర్థము
|
తూర్పుముఖము
|
భుజంగ శయనము
|
తిరుమాళశై ఆళ్వార్
|
గగనాకార విమానము
|
గరుత్మంతునకు, హనుమంతునకు
|
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
వైష్ణవ దివ్యదేశాలు
మూలాలు
వెలుపలి లింకులు