తిరుమాలిరుం శోలై మలై
తిరుమాలిరుం శోలై మలై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. విశేషాలుఈ క్షేత్రమునము దక్షిణ తిరుపతి అని, వనగిరి అని ఇతర పేర్లు ఉన్నాయి. ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో ఉంటారు. మూలవర్కు వైకుంఠ నాథన్, పరమ స్వామి అనే తిరునామములు ఉన్నాయి. స్వామి సుదర్శన చక్రహస్తులై వేంచేసియున్నారు. ఈ క్షేత్రస్వామికి ఆండాళ్ "నాఱు నాట్రుంపోళ్ " అను పాశురమున స్వామికి నూరు గంగాళముల అక్కారవడిశల్(పాయసాన్నము), నూరు గిన్నెలతో వెన్న ఆరగింపుచేతునని మాట యిచ్చింది. పిమ్మట భగవద్రామానుజులు అవతరించి ఆండాళ్ ఇచ్చిన మా తా సఫలం చేయాలని నూరు గంగాళముల అక్కారపడిశల్, వెన్న ఆరగింపుచేసి పిమ్మట ఈ విషయమును ఆండాళ్ సన్నిధిలో విజ్ఞాపన చేసాడు. ఆండాళ్ సంతుష్టాంత రంగులై ఉడయవరులను జూచి "ఎన్ కోయిల్ అణ్ణనే" అని పిలిచి ఆదరించి గౌరవించిందట. అది మొదలు ఉడయవర్లకు "గోదాగ్రజ:" అనియు "కోయిల్ అణ్ణన్" అని పేర్లు వచ్చాయి. ఇచట ఆండాళ్ "వీట్రిరుంద తిరుక్కోలముతో(కూర్చున్న భంగిమ) ప్రతిష్టితమై ఉంది. ఈక్షేత్రమునకు "మయల్ మిగు పొళిల్"(తిరువాయ్ మొళి 2-10-3)(దట్టమై తోటలుగల దివ్యదేశము) అను విశిష్టమైన తిరునామము ఉంది. తిరుమంగై ఆళ్వార్ ఈక్షేత్రస్వామిని "తెన్నానై" (తెఱ్కే ఆనై) దక్షిణ దిగ్గజముగా అభివర్ణించారు. ఈక్షేత్రస్వామికి కళ్ళళగర్ అను మరొక పేరు ఉంది. నమ్మళ్వార్లు "శొ-ఱ్కవిగాళ్" అని తిరువాయి మొళిలో "నె-ముయిరుముళ్ కలన్దు" (మనస్సు నందును ప్రాణము నందును కలసిపోయి) అని సర్వేశ్వరుని "ఆశ్రిత వ్యామోహమనెడి గుణమును అభివర్ణించింది. నమ్మాళ్వార్ల భక్తికి పరవశుడైన సర్వేశ్వరుడు ఆళ్వార్లను వీడలేక వారి తిరుమేని యందు మిక్కిలి ప్రీతిని చూపగా ఆళ్వార్లు "అయ్యో! సర్వేశ్వరుడు నన్ను ఈ దేహముతోనే పరమపదమునకు తీసికొని పోవునేమో! అట్లైన ఈ సంసారము నిత్యమగునే!" యని తలచి సర్వేశ్వరుని ప్రార్థించి ఈ దేహముపై మోహమును విడువమని ప్రార్థింపగా స్వామి యట్లేయని యంగీకరించెను. అపుడు ఆళ్వార్లు "ఆహా! ఏమి సర్వేశ్వరుని శీలగుణము, ఆశ్రిత వ్యామోహము" అని ఆశ్చర్యపడి ఆ ఆశ్రిత వ్యామోహమును "శొ-ల్కవిగాళ్" అను దశకమున ప్రకటించుచున్నారు. ఈ సన్నిధి చాలా విశాలమైంది. దీనికి అళగర్ కోట యని పేరు. సన్నిధికి ఉత్తరముగా కొండపై నూపుర గంగ కలదు. సన్నిధి గోపురద్వారమున 18వ పడి గట్టులో "కరుప్పణన్" సన్నిధికి కావలిగా ఉంటాడు. స్వామిసన్నిధి తాళము వేసిన పిమ్మట ఆ తాళములను వీరి సన్నిధిలో ఉంచుతారట. బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వార్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేస్తారు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేస్తారు. మేషం పౌర్ణమినాడు ఏటి ఉత్సవమునకు పెరుమాళ్లు వేంచేయగా తాయార్లకు కోపము వచ్చినదట. ఆకారణమున నాడు మొదలు బ్రహ్మోత్సవము వరకు సన్నిధి ప్రాకారములో గల ఒక మండపములో వేంచేసి ఆవారాదన అందుకుంటుంది. ఉత్సవములుమేషమాసములో పౌర్ణమినాడు మధురలో గల వైగైనదిలో ఏటి ఉత్సవము జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై శ్రీకూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవముననుగ్రహించిరి. కర్కాటక మాసములో బ్రహ్మోత్సవము జరుగును. పలు సత్రములు సన్నిధి సమీపములో ఉన్నాయి. సన్నిధిలో ప్రసాదము లభించును. అన్ని వసతులు గల క్షేత్రము. సాహిత్యంశ్లో|| శ్రీమద్వనాద్రి పథ నూపుర నిమ్నగాంతే పాశురాలుపా. కిళరొళి యిళమై కెడువదన్ మున్నమ్, పా. అలమ్బా వెరుట్టా క్కొన్ఱు తిరియు మరక్కరై వివరాలు
చేరే మార్గంమధురకు 15 కి.మీ దూరము. చిత్రమాలికఇవికూడా చూడండిమూలాలువెలుపలి లింకులు |