దేవప్రయాగ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
ఈ క్షేత్రము హరిద్వారము నుండి హిమవద్గిరికి పోవుదారిలో నున్నది. హరిద్వార్ నుండి ఈక్షేత్రమునకు పోవుమార్గంలోనే హృషీకేశ్ ఉంది. తపోవనము, లక్ష్మణస్వామి సన్నిధి (లక్ష్మణఝూలా) వ్యాసఘాట్-శ్రీసీతారాముల సన్నిధి ఉంది. హరిద్వారము నుండి 100 కి.మీ. దూరములో ఈ కండమెన్ఱుం కడినగర్ క్షేత్రము ఉంది. దీనినే దేవప్రయాగ అంటారు. కోవెలకు వెనుక హనుమాన్ సన్నిధి ఉంది. అలకనందా నది ప్రవహించు దేశము-ఆళ్వార్ కీర్తించిన పెరుమాళ్లను రఘునాథ్‌జీ అంటారు.
అలకనంద నది, భాగీరథి సంగమం, గంగా నది లేదా గంగా ప్రధాన కాండం ప్రారంభం
సాహిత్యం
శ్లో. శ్రీ మన్మంగళ పుణ్యతీర్థ రుచిరే క్షేత్రే ప్రయాగాభిదే
త్వాలింగ్య ప్రియ పుండరీక లతికాం శ్రీ నీలమేఘో విభు:|
రేజే మంగళ దేవయాన నిలయ:ప్రాగ్వక్త్ర సంస్థానగ:
భారద్వాజ మునీక్షిత: కలిరిపు శ్రీవిష్ణుచిత్త స్తుత:||
పాశురాలు
పా. తజ్గై యై మూక్కుమ్ తమయనై త్తలయుమ్ తడన్దవెన్ దాశరదిపోయ్
ఎజ్గుమ్ తన్ పుకழா విరున్దరశాణ్డ; వెమ్బురుడోత్తమ నిరుక్కై,
కజ్గై కజ్గై యెన్ఱ వాశకత్తాలే; కడువినై కళైన్దిడు కిఱ్కుమ్
కజ్గై యిన్ కఱై మేల్ కైతొழுనిన్ఱ కణ్డమెన్నుమ్ కడినకరే||
పెరియాళ్వార్లు-పెరియాళ్వార్ తిరుమొழி 4-7-1
వివరాలు
ప్రధాన దైవం పేరు
ప్రధాన దేవి పేరు
తీర్థం
ముఖద్వార దిశ
భంగిమ
కీర్తించిన వారు
విమానం
ప్రత్యక్షం
నీలమేఘ పెరుమాళ్
పుండరీకవల్లి
మంగళతీర్థం
తూర్పుముఖము
నిలచున్న భంగిమ
పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్
మంగళ విమానం
భరద్వాజమహర్షికి
అలకనంద నది, భాగీరథి సంగమం, గంగా నది లేదా గంగా ప్రధాన ప్రారంభం
మంచిమాట
ఆశ్రయింప వలసిన వానిని అన్నిటిని ఆశ్రయించి భగవంతుని కూడా ఆశ్రయించుట "భక్తి".
విడువ వలసిన వాటి నన్నింటిని విడచి తనను కూడా విడుచుట "ప్రపత్తి".
అలకనంద (ఎడమ), భాగీరథి (కుడి) నదుల సంగమం దేవప్రయాగ్ వద్ద గంగను ఏర్పరుస్తుంది
చేరే మార్గం
హృషికేశ్ నుండి బదరీమార్గంలో 70 కి.మీ దూరంలోను హరిద్వార్-బదరీ మార్గంలో 95 కి.మీ. దూరంలోను గలదు
చిత్రమాలిక
2019 అక్టోబరులో రుతుపవనాల తర్వాత దేవప్రయాగ
భగీరథి (ఎడమ) దేవప్రయాగ వద్ద అలకనంద (కుడి) తో కలుస్తుంది
అవక్షేపాలతో నిండిన అలకనంద నది దేవప్రయాగలోకి ప్రవహిస్తోంది.
దేవప్రయాగ్ భాగీరథి, అలకనంద నదుల సంగమం. ఈ నదికి దేవప్రయాగ దాటి "గంగా" (లేదా గంగా) అనే పేరు వచ్చింది
దేవప్రయాగలో అలకనంద, భాగీరథి సంగమం. ఇప్పుడు నదిని గంగ అని పిలుస్తారు
ఇవికూడా చూడండి
వైష్ణవ దివ్యదేశాలు
మూలాలు
వెలుపలి లింకులు