జమానిపాలి ప్రాంతంలో NTPC వారి కోర్బా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది.[3][4][5] దీనికి గేవ్రా, కుస్ముందా గనుల నుండి బొగ్గును వస్తుంది. విద్యుత్కేంద్రానికి అవసరమైన నీటిని హస్దేవ్ నది నుండి తీసుకుంటుంది.[6] కోర్బా థర్మల్ పవర్ స్టేషన్ జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది.[7][8] హస్దేవ్ థర్మల్ పవర్ స్టేషన్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ థర్మల్ పవర్ స్టేషన్, ల్యాంకో అమర్కంటక్ పవర్ ప్లాంట్ వంటి చిన్న విద్యుత్కేంద్రాలు నగరానికి సమీపంలో ఉన్నాయి.
భారత్ అల్యూమినియం కంపెనీకి ఇక్కడ తయారీ కేంద్రం ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కర్మాగారాల్లో ఒకటి. 2009 లో, బాల్కో స్మెల్టర్ వద్ద గన్నన్ డంకర్లీ & కంపెనీ వారిచే నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోయి 49 మంది కార్మికులు మరణించారు. ఈ సంఘటనలో GDCL యాజమాన్యం నిర్లక్ష్యానికి పాల్పడింది.[9][10][11]
రవాణా
రైలు
కోర్బా రైల్వే స్టేషను, హౌరా-నాగ్పూర్-ముంబై మార్గంలో ఉన్న చంపా రైల్వే జంక్షనుకు అనుసంధానించబడి ఉంది. ఈ స్టేషన్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకు వస్తాయి. ఈ స్టేషన్నుండి బిలాస్పూర్కి నేరుగా రైళ్ళున్నాయి. ఈ 50.7 కి.మీ. బ్రాడ్ గేజ్ రైలుమార్గాన్ని 1953, 1956 మధ్య నిర్మించారు. 1987 - 1988 లో ఈ మార్గాన్ని విద్యుదీకరించారు. 1988 -1989 లో గేవ్రా రోడ్ రైల్వే స్టేషన్ [12][13] వరకు పొడిగించారు.
రోడ్లు
కోర్బా నుండి చంపాకు జాతీయ రహదారి 149B ఉంది. NH 130 ద్వారా నగరం నుండి అంబికాపూర్, బిలాస్పూర్ లకు రవాణా సౌకర్యం ఉంది.
↑Chhattisgarh State Power Generation Company, "Thermal power stations"Archived 11 నవంబరు 2013 at the Wayback Machine, Chhattisgarh State Power Generation Company website, accessed February 2012.