దంతెవాడ
దంతెవాడ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని పట్టణం. దీన్ని దంతేవారా అని కూడా పిలుస్తారు. ఇది దంతెవాడ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఇది బస్తర్ డివిజన్‌లో నాల్గవ అతిపెద్ద పట్టణం. పట్టణంలో ఉన్న దంతేశ్వరి దేవాలయ దేవత అయిన దంతేశ్వరి దేవత పేరు మీద ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది. జగదల్పూర్ పట్టణం నుండి 80 కి.మీ. అమ్మవారిని శక్తి అవతారంగా పూజిస్తారు. దేవాలయం యాభై రెండు పవిత్ర శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దంతెవాడకు సమీప నగరం విశాఖపట్నం. దంతెవాడకు, విశాఖపట్నం నుండి బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఉంది. దంతెవాడ 18°54′00″N 81°21′00″E / 18.9000°N 81.3500°E వద్ద,[1] సముద్రమట్టం నుండి సగటున 351 మీటర్ల ఎత్తున ఉంది. దంతెవాడ నగరం శంకణి, దంకిని నదుల ఒడ్డున ఉంది. ఆసక్తి ఉన్న ప్రదేశాలుదంతేశ్వరి ఆలయంభారతదేశంలోని శక్తిపీఠాలలో ఒకటైన దంతేశ్వరి మాత ఆలయం దంతెవాడలో ఉంది. దంతెవాడ ప్రధాన దేవత దంతేశ్వరి. ప్రపంచ ప్రఖ్యాత బస్తర్ దసరా అనేది దంతెవాడ శక్తిపీఠం నుండే ప్రారంభమవుతుంది. ధోల్కల్ గణేశుడుసముద్ర మట్టం నుండి 3000 అడుగుల ఎత్తున, బైలాదిలా శ్రేణుల లోని పచ్చని అడవుల మధ్య ఈ వినాయక విగ్రహం ఉంది. శిఖరానికి మార్గం అందమైన ప్రకృతి దృశ్యాలతో మధ్య గుండా సాగుతుంది. పర్యాటకులు నిజమైన సాహస అనుభవం కోసం ధోల్కాల్‌ను సందర్శిస్తారు. జనాభా2011 జనగణన ప్రకారం,[2] దంతెవాడ జనాభా 13,633. జనాభాలో పురుషులు 53%, మహిళలు 47% ఉన్నారు. దంతేవాడ సగటు అక్షరాస్యత 70%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 61%. 2001 లో దంతెవాడ జనాభాలో, 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మూలాలు
|