జాతీయ రహదారి 216 (భారతదేశం)
జాతీయ రహదారి 216 (ఎన్‌హెచ్ 216) (పాత సంఖ్య: జాతీయ రహదారి 214, 214A) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోటిపల్లి నుండి దిగమర్రు ద్వారా ఒంగోలు నగరాల్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య, జాతీయ రహదారి 214, 214A కలిపి 216గా మార్చబడింది.[2] ఇది కత్తిపూడి వద్ద గల ఎన్‌హెచ్ 16 వద్ద మొదలై కాకినాడ, అమలాపురం, దిగమర్రు (పాలకొల్లు), నరసాపురం, బంటుమిల్లి,మచిలీపట్నం, రేపల్లె, చెరుకుపల్లె, బాపట్ల, చీరాల మీదుగా తిరిగి ఒంగోలు వద్ద ఎన్‌హెచ్ 16 ను కలుస్తుంది.[3][4] విశాఖపట్నం-కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్, ఈ రహదారి వెంబడి ప్రతిపాదించిన ప్రాజెక్టు. [5] మార్గంఇది కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి కాకినాడ సిటీ, యానాం ,అమలాపురం , రాజోలు ,నరసాపురం, మొగల్తూరు, నాగిడిపాలెం,బంటుమిల్లి,మచిలీపట్నం ,అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, వేటపాలెం, మీదుగా ఒంగోలు వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. 216, 216ఎ జాతీయ రహదారుల అభివృద్ధికి రెండు ప్రధాన వంతెనలు అడ్డంకిగా ఉన్నాయి. 216 జాతీయ రహదారిపై పాలకొల్లు వద్ద నరసాపురం కాల్వపై వంతెన పనులు సగంలోనే నిలిచిపోయాయి. నరసాపురం కాల్వతోపాటు, రైల్వేట్రాక్ పైన వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. 216ఎ జాతీయ రహదారికి మొగల్తూరు-నాగిడిపాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన స్తంభాలు గతంలో నీటిలోకి ఒరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ రహదారి మొత్తం పొడవు 391.3 కిలోమీటర్లు (243.1 మై.).[6] ఇది ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల గుండా వెళుతుంది. జాతీయ రహదారి 216 కత్తిపూడి గ్రామం వద్ద ఎన్‌హెచ్16 నుండి ప్రారంభమై, గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ, యానాం, ముమ్మిడివరం, అమలాపురం , రాజోలు, దిగమర్రు (పాలకొల్లు ), నర్సాపురం, బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, రేపల్లె, చెరుకుపల్లి, బాపట్ల, చీరాల వంటి పట్టణాల గుండా వెళ్ళి, ఒంగోలు వద్ద ఎన్‌హెచ్ 16తో కలుస్తుంది. ప్రాజెక్టు వివరాలుకత్తిపూడి-కాకినాడ మధ్య దాదాపు 38 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల మేర నాలుగు లైన్ల దారిగా విస్తరించారు. కాకినాడ శివారు నుంచి కాకినాడ రూరల్‌లోని అచ్చంపేట నుంచి కరప మండలం ఉప్పలంకమొండి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు, 150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. అమలాపురం ప్రాంతంలో నాలుగు లైన్ల రహదారిగా ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు పి గన్నవరం సమీపంలోని బోడసకుర్రు వద్ద ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. 2019 చివరి త్రైమాసికం నాటికి నాలుగు లేన్ల రహదారిని పూర్తి చేయాలని, కాకినాడ వద్ద బైపాస్ రోడ్లకు సంబంధించిన ఫ్లైఓవర్ పనులను 2020 చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఎన్‌హెచ్ 216 వ్యవసాయ ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా కోసం ఈ ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. తూర్పుగోదావరిలోని కోనసీమ ప్రాంతానికి రైలు కనెక్టివిటీ లేనందున ఈ ప్రాంతానికి హైవే అవసరం. రాష్ట్రాల వారి పొడవు
ఇవి కూడా చూడండిమూలాలు
|