అమలాపురం
అమలాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోనసీమ జిల్లాకు చెందిన పట్టణం, జిల్లా కేంద్రం. చరిత్రఅమలాపురం పూర్వనామం అమృతపురి అనీ, కాలక్రమేణా అమ్లీపురిగా, అమ్లీపురి, అమలాపురంగా మారిందని చెప్తారు. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది. భౌగోళికంరాష్ట్ర రాజధాని అమరావతి కి తూర్పుదిశలో 202 కి.మీ దూరంలోవుంది. సమీప నగరమైన కాకినాడకు నైరుతి దిశలో 63 కి.మీ దూరంలో వుంది. జనగణన గణాంకాలు2011 జనాభా లెక్కల ప్రకారం అమలాపురం 53,231 జనాభా ఉండగా అందులో పురుషులు 26,485,మహిళలు 26,746 మంది ఉన్నారు. అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 14,639 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4635 ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 89.78%. ఇది రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ. అమలాపురంలో పురుషుల అక్షరాస్యత 93.24% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 86.39% అక్షరాస్యులుు ఉన్నారు.[5] పరిపాలనఅమలాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యాలుజాతీయ రహదారి 216 పై అమలాపురం వుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అమలాపురం బస్సు స్టేషన్ నుండి బస్సు సేవలు నడుపుతుంది. రాజమండ్రి, కాకినాడ నాన్ స్టాప్, ప్రతి గంటకు, అలాగే సుదూరమైన ప్రాంతాలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ తిరుపతి వంటి సర్వీసులు రోజు నడుపుతున్నారు.[6] సమీప రైల్వే స్టేషన్ 16 కి.మీ దూరంలోని కోటిపల్లిలో వుంది. విద్యా సౌకర్యాలు
సంస్కృతిదసరా ఉత్సవాలుప్రధాన వ్యాసం: అమలాపురం దసరా ఉత్సవాలు
విజయదశమి ఉత్సవాలు ప్రసిద్ధిచెందినవి. ప్రతి ఏటా నిర్వహిస్తారు.ఇక్కడ విజయదశమి సందర్భంగా నిర్వహించే తాలింఖానా, వాహన ఊరేగింపు ప్రత్యేకం. సంక్రాంతి ఉత్సవాలుప్రధాన వ్యాసం: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
తెలుగువారికి అన్ని పండగల కంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ రైతులు ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ. పర్యాటక ఆకర్షణలు
ప్రముఖులు
చిత్ర మాలిక
ఇవీ చూడండిమూలాలు
బయటి లింకులు |