పాలకొండ
పాలకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. చరిత్రపాలకొండ సంస్థాన చరిత్రమద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం జిల్లాలో సిక్కోలు ప్రాంతమునందు కొండజమీందారులతో పాలకొండ సంస్థానము వుండేది. 108 జిరాయితీ గ్రామములు, 68 వ్యవసాయ గ్రామములు,49 అగ్రహారములు విస్తీర్ణము కలిగినది. వీరు విజయనగర సంస్థానమునకు లోబడి యుండి యుద్ధ సమయంలో సహకరించుటయే కాకుండా సంవత్సరానికి 52 వేల రూపాయలు కప్పము కూడా చెల్లించేవారు. పాలకొండ సంస్థాన పాలకులు కోదు లేక జాతాపు అను కొండజాతి వారు. జయపుర సంస్థాన పాలకుడు రాజా విశ్వంభరదేవు ( 1672 -1676 ) ఈ కుటుంబము వారి మూలపురుషుడు అయిన 'దన్నాయి' కుమారుడిని నరేంద్రనాయుడు అను బిరుదుతొ పాలకొండ, వీరఘట్టములకు జమీందారుగా నియమించాడు. విజయరామరాజు (-1796), సీతారామరాజు (1796-1798), వెంకటపతిరాజు (1798-1828 ) సంస్థాన భాద్యతలను నిర్వహించారు. మైనరగు కూర్మరాజనరేంద్రరావుని వారసునిగా 1829 లొ కంపెనీ వారు గుర్తించి రాజాగారి వితంతు భార్యయగు చామలయ్యను ఎష్టేటు మేనేజర్ గా నియమించి ప్రభుత్వ పర్యవేక్షణలోనికి వచ్చినది. తదుపరి పద్మనాభాచార్యులను సంరక్షకునిగా నియమించారు. నిర్వహణ సరిగా లేక 1831లొ కూర్మరాజు మేజరు అయ్యేసరికి 93 వేల రూపాయలు కప్పము బకాయిలు ఉన్నాయి. 1837 లొ కూర్మరాజును జమీందారీ నుండి తప్పించి 1846 వరకూ కలెక్టర్ అజమాయిషీలొ జమీందారీ పాలన సాగింది. తదుపరి జమీందారీని అర్భత్ నాట్ కంపెనీకి కవులునకు ఇచ్చారు మరికొంతకాలానికి ప్రభుత్వ పరమైనది. బ్రిటిష్ కంపెనీ వారు పాలకొండ జమీందారీ కుటుంబమునందు ముఖ్యపరివారమును ఖైదుచేసి రాయవేలూరు కొటయందు నిర్భందించారు. కూర్మరాజు నకు మరణశిక్ష నిర్ణయించి తదుపరి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 1843 లొ కూర్మరాజు గుత్తి కోటయందు మరణించాడు. 1869 లొ మద్రాసు గవర్నర్ రాయవేలూరు సందర్శించినపుడు పాలకొండ కుటుంబ సభ్యులను పరామర్శించి విజయరామరాజును విడుదల చేసి కృష్ణానదీ తీరమునందు నివాసం చేయవచ్చునని ఉత్తర్వులు జారీ చేశాడు. కంపెనీ వారు భత్యాన్ని నెలకు 17 రూపాయలనుండి 250 రూపాయలు వరకూ పెంచారు. పాలకొండ వంశస్థులు 20వశతాబ్దానికి ముందే రాయవేలూరు కోటయందు మరణించారు.[2] భౌగోళికంజిల్లా కేంద్రమైన పార్వతీపురానికి ఆగ్నేయంగా 48 కి.మీ. దూరంలో వుంది. జనాభా గణాంకాలు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 74,972 - పురుషులు 36,871 - స్త్రీలు 38,101 [3] పరిపాలనపాలకొండ నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.. దీనికి 2014 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో YSRCP విజయం సాధించింది. రవాణా సదుపాయాలుశ్రీకాకుళం - పార్వతీపురం రహదారి పై పట్టణం వుంది. సమీప రైల్వే స్టేషన్లు 28 కి.మీ దూరంలో గల ఆముదాలవలస. ఇవీ చూడండిమూలాలు
వెలుపలి లంకెలు |