పార్వతీపురం
పార్వతీపురం, (వినండి: // ( listen)), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, జిల్లా కేంద్రం. భౌగోళికంరాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 523 కి.మీ, సమీప నగరమైన విజయనగరానికి ఉత్తరంగా 87 కి.మీ దూరంలోవుంది. జనాభా గణాంకాలు2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 53,844. పరిపాలనపార్వతీపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యాలుజాతీయ రహదారి 16 పై గల శ్రీకాకుళం నుండి ఈ ఊరికి రహదారి ఉంది. టాటానగర్-జార్సుగూడ-విజయనగరం, విజయనగరం-రాయ్ పూర్ లైన్‌లో పార్వతీపురం ఉంది. పార్వతీపురం రైల్వే స్టేషన్, పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అనే రెండు స్టేషన్లున్నాయి. సమీప విమానాశ్రయం 150 కి.మీ దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. పర్యాటక ఆకర్షణలుదేవాలయాలు
జలాశయాలు, ఆనకట్టలు
ప్రముఖ వ్యక్తులు
శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి గారు, తెలుగు పండితునిగా ఇక్కడి మిషనరీ హైస్కూల్లో ఉద్యోగ జీవితం ప్రారంభించి ఇక్కడే పదవీ విరమణ చేశారు.వీరు కూడా తెలుగు సాహిత్యంపై ఎనలేని క్రృషి చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు రచించారు. పంతుల సీతాపతిరావు మాస్టారు అంటే తెలియనివారుండరు. ఈయన కూడా మిషనరీ స్కూల్లోనే భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించే మాస్టారుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి పదవీవిరమణ చేశారు. వీరు భౌతిక, రసాయనశాస్త్రాలలో నిష్ణాతులు. వీరికి ఆంగ్లము, తెలుగు భాషలపైన మంచి పట్టు ఉండడమే కాకుండా రచనా వ్యాసంగం ఆయా భాషలలో కొనసాగించారు.
ఇవీ చూడండి
మూలాలు
వికీమీడియా కామన్స్‌లో Parvathipuramకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి. వెలుపలి లంకెలు |