శ్రీకాకుళంఈ వ్యాసం శ్రీకాకుళం జిల్లా నగరం గురించి. కృష్ణా జిల్లాలోని గ్రామం కొరకు, శ్రీకాకుళం (ఘంటసాల) చూడండి.
శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రం.[6]ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.[7] పేరు వ్యుత్పత్తిబ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్", సిక్కోలు అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు.[7] భౌగోళికంశ్రీకాకుళం నగర విస్తీర్ణం 20.89 చ.కి.మీ.[5] రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్య దిశలో 463 కి.మీ దూరంలో వుంది. జనాభా గణాంకాలు2011 జనాభా లెక్కలు ప్రకారం, ఈ నగర జనాభా 1,49,592. ఇందులో 74,546 మగవారు,75,046 ఆడవారు ఉన్నారు.[8] 11,001 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు, 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతొ 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు.[9] పరిపాలనశ్రీకాకుళం నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది. రవాణాజాతీయ రహదారి 16 నగరానికి సమీపంగా పోతుంది.[10] 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ అనే పేరుతో ఆమదాలవలసలో ఉంది. 2006 లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రం శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆఫీసు ఆవరణలో పెట్టారు. సమీప విమానాశ్రయం 106 కి.మీ. దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. విద్యఒక మెడికల్ కాలేజి (రిమ్స్), దంత వైద్యకళాశాల ("చాపురం" గ్రామ సమీపాన), ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల, ఒక న్యాయ కళాశాల ఉన్నాయి. ప్రైవేటు రంగంలో రాగోలు వద్ద జెమ్స్ వైద్య కళాశాల ఉంది. వైద్యం400 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రి తో పాటు, కిమ్స్ ఆసుపత్రి ఉంది. న్యాయ స్థానాలునగరంలో 1. జిల్లాకోర్టు, 2. మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి. పర్యాటక ఆకర్షణలు
ప్రముఖులు
మూలాలు
బయటి లింకులువికీమీడియా కామన్స్‌లో Srikakulamకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి. వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది శ్రీకాకుళం. |