అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది మూసీనది సమీపంలో ఉంది. ఇక్కడ సెంట్రల్ బస్టాండు ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రముఖ రవాణాకేంద్రంగా ఉంది. ఈ బస్టాండు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను ఏర్పాటుచేయడం జరిగింది.[1] నిజాం కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ ప్రాంతంలోనే నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, హైకోర్టు, సాలార్ జంగ్ మ్యూజియం వంటివి అఫ్జల్‌గంజ్ లోనే ఉన్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం ఆగ్నేయదిక్కులో పురానీహవేలిలో నిజాం మ్యూజియం కూడా ఉంది. అఫ్జల్‌గంజ్ నుండి ముసీనది మీదుగా ఉత్తరంగా విస్తరించివున్న రహదారి సర్దార్ పటేల్ రోడ్డుతో కలుస్తుంది. అఫ్జల్‌గంజ్ నుండి దక్షిణం వైపు చార్మినార్ ఉంది. చరిత్ర5 వ నిజాం రాజైన అఫ్జల్ ఉద్ దౌలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు ఈ భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగంబజార్, పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.[2] వాణిజ్య ప్రాంతంప్రజలు అవసరాలకు కావలసిన అనేక వస్తువుల దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. మూలాలు
|