విద్యానగర్
విద్యానగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ విద్యానగర్ రైల్వే స్టేషను,[1] దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఉంది. ఇది వ్యాపారప్రాంతంగా పిలువబడుతుంది. నివాస, వ్యాపార ప్రాంతంఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న ఈ విద్యానగర్ అనువైన నివాసప్రాంతంగా ఉంటూ, అనేక అపార్టుమెంటులను, ఇళ్ళను కలిగివుంది. ఎక్కువ సంఖ్యలో వ్యాపార సంస్థలు కూడా విద్యానగర్ లో ఉన్నాయి. ఇక్కడ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి, ఆంధ్ర మహిళా సభ, మహారాజా ఫంక్షన్ హాల్ తోపాటూ స్పెన్సర్స్, రిలయన్స్, బాటా, టైటాన్, ఎయిర్‌టెల్, వోడాఫోన్, రిలయన్స్ డిజిటల్, ఐడియా షోరూమ్స్ ఉన్నాయి. విద్యాసంస్థలువిద్యానగర్ లో ఆంధ్ర మహిళా సభ, వివేకానంద ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల, రాణి రుద్రమదేవి డిగ్రీ కళాశాల, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు...అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, చైతన్య రెసిడెన్షియల్ స్కూల్, ది మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ వంటి పాఠశాలలతోపాటూ ఇతర కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.[2] రవాణాఇక్కడ విద్యానగర్ రైల్వే స్టేషనుతో పాటు ఎం.ఎం.టి.ఎస్. కూడా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 107 (దిల్‌సుఖ్‌నగర్ నుండి సికింద్రాబాద్), 113 (ఉప్పల్ నుండి మెహదీపట్నం, కూకట్ పల్లి), 3 (కోఠి నుండి తార్నాక, హబ్సిగూడ, నాచారం, మౌలాలి) బస్సులు నడుస్తున్నాయి. మూలాలు
|