ఆఘాపురా
ఆఘాపురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది హైదరాబాదు, నాంపల్లి, మెహదీపట్నం ప్రాంతాల మధ్యన ఉంది. ప్రత్యేకతఅఘాపురా చార్ఖండిల్కు ఈ ప్రాంతం పేరొందింది. ఈ ప్రాంతంలో రాత్రిపూట వెలిగే నాలుగు లైట్లు ఉండేవి. వాటికోసం నియమించబడిన వ్యక్తి, ప్రతిరోజూ సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించేవాడు. సూఫీ సాధువు షా మొహమ్మద్ హసన్ అబుల్ ఉలై శిష్యుడైన అఘా ముహమ్మద్ దావూద్ అబుల్ ఉలై పేరు మీద ఈ ప్రాంతానికి అఘాపురా అనే పేరు పెట్టబడింది.[1][2] ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అఘాపురా దర్గా అని కూడా పిలువబడే ఈ మందిరాన్ని ప్రదానం చేశారు.[3] రవాణాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అఘాపురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి కిలోమీటరు దూరంలోని నాంపల్లి లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది. వ్యాపారంఅఘాపురా దర్గా ఉర్స్ (వేడుక) సందర్భంగా అఘాపురాలో ఉత్సవాలు జరుగుతాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐంఐఎం) పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాం వద్ద ఉండడంవల్ల ఈ ప్రాంతం రాజకీయంగా పేరుపొందింది.[4] సమీప ప్రాంతాలు
మూలాలు
|