లక్డికాపూల్
లక్డికాపూల్, తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని పురాతన శివారు ప్రాంతాలలో ఇది ఒకటి. దీనికి సమీపంలో లక్డికాపూల్ ఎంఎంటిఎస్, రవీంద్ర భారతి, హెచ్‌పి పెట్రోల్ పంప్, టెలిఫోన్ భవన్, కలెక్టర్ కార్యాలయం, సిఐడి కార్యాలయం, గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి. పద వివరణహిందీ, ఉర్దూ భాషలలో లక్డికా అంటే "చెక్కతో చేసినది" అని, పూల్ అంటే "వంతెన" అని అర్థం. చెక్కతో తయారుచేసిన వంతెన పేరు మీదుగా ఈ ప్రాంతానికి లక్డికాపూల్ అనే పేరు వచ్చింది. రవాణాలక్డికాపూల్ ప్రాంతం రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలతో కలుపబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదేశం నుండి నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపబడున్నాయి. ఇక్కడ లక్డి కా పూల్ రైల్వే స్టేషను, లక్డికాపూల్ మెట్రో స్టేషను ఉన్నాయి.[1] ప్రభుత్వ ఆసుపత్రులు
ఇతర వివరాలుఈ ప్రాంతం చరిత్రను ఆవిష్కరించేలా హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లక్డికాపూల్ కూడలిలో చెక్క వంతెన నమూనాను ఏర్పాటు చేయబడింది.[2] మూలాలు
|