తుని రైల్వే స్టేషను
చరిత్ర1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [5] ధూమ శకటాలు (ఆవిరి యంత్రాలు) ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో విశాఖపట్నం తరువాత తుని లోనే ఆహారం అందుబాటులో ఉండేది అందుకే నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మద్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడా చెప్పేవారు. వర్గీకరణతుని రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజన్లో ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.ఆదాయాలు, ప్రయాణీకుల నిర్వహణ పరంగా, ఈ తుని రైల్వే స్టేషను నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) రైల్వే స్టేషన్‌గా వర్గీకరించబడింది.2022–23 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్‌ల పునః-వర్గీకరణ ఆధారంగా, ఎన్.ఎస్.జి–3 కేటగిరీ స్టేషన్ ₹20 – ₹100 కోట్ల మధ్య సంపాదిస్తుంది. 5–10 million మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది.[6] భారతీయ రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ పథకమైన ఆదర్శ్ స్టేషన్ స్కీమ్ కోసం ఎంపిక చేయబడింది.[7][8] [9][10] మూలాలు
బయటి లింకులువికీమీడియా కామన్స్‌లో Tuni railway station, Andhra Pradeshకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
|